ఆనంద్ షాజహాన్ నివసించేవాడు.. హీరోయిన్ సోదరి సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌ సోదరి రంగోలి చందేల్‌ తాజ్‌ మహల్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

Samba Siva Rao
Updated on: 8 April 2020 6:49 PM IST
ఆనంద్ షాజహాన్ నివసించేవాడు.. హీరోయిన్ సోదరి సంచలన వ్యాఖ్యలు
X
Rangoli Chandel(File Photo)

బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌ సోదరి రంగోలి చందేల్‌ తాజ్‌ మహల్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో రంగొలిపై సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్ల విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజ్‌ మహల్‌ ప్రపంచంలోనే 7వ వింతగ పరిగణించబడుతున్న విషయం తెలిసిందే. ఆమె తీరును ఖండిస్తూ మండిపడుతున్నారు. రంగోలి తన ట్విట్టర్ లో తాజ్‌ మహల్‌ కేవలం సమాధి మాత్రమేనని.. 'ప్రేమ చిహ్నం' కాదంటూ రంగోలి బుధవారం ట్వీట్‌ చేశారు.

'తాజ్‌ మహల్‌ను అనేక మంది సమధిగానే పరిగణిస్తారు. దానిని ఎప్పటికి ప్రజలను వింతగా చూడలనుకొరు..కొందరు బలవంతం చేస్తున్నారు' అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. అంతేగాక ముంతాజ్‌ గురించి కూడా రంగోలి ట్వీట్‌లో ప్రస్తావించారు. ముంతాజ్‌ బేగంపై ఉన్న ప్రేమ, గౌరవంతో షాజాహాన్‌ అతిపెద్ద కట్టడం నిర్మించారు. ఒళ్ళు గగుర్పొడిచే విషయాలెన్నో దాని వెనుక ఉన్నాయని, ముంతాజ్ బేగంను షాజాహాన్‌ ఎంతగా హింసించేవాడో మీకు తెలుసా?' అంటూ తన ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు

ఇక నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు..మీ అభిప్రాయం అవసరం లేదు.. 'తాజ్‌ మహల్‌ను ప్రేమకు చిహ్నంగా...మిమల్ని అంగీకరించాలని ఎవరూ కోరడం లేదు.' 'ఇది ప్రపంచలోని వింత అని చరిత్రే చెబుతుంది .'అంటూ విమర్శిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది ప్రేమకు చిహ్నంగా భావిస్తు ప్రేమికులు సైతం తాజ్‌ మహాల్‌ బొమ్మలను బహుమతులుగా ఇచ్చుకుంటుంటారు. కాగా రంగోలి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story