Top
logo

Kangana Ranaut: ఎముకలు విరగ్గొడతా..మాజీ మంత్రిపై కంగనా ఫైర్!

Kangana Ranaut fires on ex minister
X

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (ట్విట్టర్ ఫోటో)

Highlights

Kangana Ranaut: నేను అందరిలాంటి దాన్ని కాదు.. నా జోలికి వస్తే ఎముకలు విరగ్గొడతా

నేను అందరిలాంటి దాన్ని కాదు.. నా జోలికి వస్తే ఎముకలు విరగ్గొడతా అంటూ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మధ్యప్రదేశ్ మాజీ మంత్రి సుఖ్ దేవ్ పన్నే కు వార్నింగ్ ఇచ్చారు. తానేమీ వయ్యారాలు వలికించి వ్యవహారాలు నడిపించే రకం వ్యక్తిని కాదని ఆమె చెప్పారు. తాను రాజపుత్ వంశానికి చెందిన దానిని అనీ.. తన జోలికి వచ్చి అవాకులూ చెవాకులూ పెలోద్దని ఆమె ఘాటుగా అన్నారు.

అంతేకాదు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకూ ఐటం సాంగ్స్ చేయని హీరోయిన్ తాను ఒక్క దానినే అని ఆమె చెప్పుకొచ్చారు. అలియభట్, దీపికా వంటి హీరోయిన్ తాను కాదని చెప్పిన కంగనా తన గురించి మాజీ మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని.. ఎముకలు విరగ్గొడతా అనీ కంగనా ఫైర్ అయ్యారు.

ఇంతకీ కంగనా ఇంతలా ఫైర్ ఎందుకయ్యిందో తెలుసా? ఇటీవల మధ్యప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రి సుఖ్ దేవ్ పన్నే కంగనాను ఆమె ఓ రికార్డింగ్ డ్యాన్సర్ అనే అర్ధం వచ్చేలా కామెంట్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో కంగనా ఘాటుగా స్పందించారు.

అంతేకాకుండా తాను గతంలో ఎన్నో పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా వద్దనుకున్నానని చెప్పారు కంగనా. అందుకే చాలామంది హీరో, హీరోయిన్లు తను టార్గెట్ చేసుకున్నారు అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

Web TitleKangana Ranaut fires on Madhya Pradesh ex minister Sukhdev Panne
Next Story