విజయ్ నీ సింప్లిసిటీకి సెల్యూట్!

విజయ్ నీ సింప్లిసిటీకి సెల్యూట్!
x
Highlights

Ilayathalapathy Vijay : తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజయ్ అనే చెపుతారు ఎవరైనా.. కేవలం సినిమాలతోనే కాకుండా మంచి మనసుతో కూడా చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు విజయ్

Ilayathalapathy Vijay : తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజయ్ అనే చెపుతారు ఎవరైనా.. కేవలం సినిమాలతోనే కాకుండా మంచి మనసుతో కూడా చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు విజయ్.. తాజాగా సోషల్ మీడియాలో విజయ్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో విజయ్ నిరాడంబర వ్యక్తిత్వానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.

నిన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకి గాను తిరువ‌ళ్ళూరు జిల్లా తామ‌రైపాక్కం ఫాం హౌజ్‌కు వెళ్లారు హీరో విజయ్. అక్కడికి అభిమానులు కూడా భారీ సంఖ్యలో వచ్చారు. దీనితో విజ‌య్‌ని అభిమానులు చుట్టుముట్టారు. దీనితో పోలీసుల స‌హ‌కారంతో విజయ్ బయటపడ్డాడు.. విజయ్ బయటకు వెళ్తున్న క్రమంలో ఓ అభిమాని చెప్పు జారవిడుచుకున్నాడు. అది చూసిన విజయ్ ఆ చెప్పును తన చేతితో తీసి అభిమానికి ఇచ్చాడు. ఈ సంఘటన వీడియోలో రికార్డు కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు విజయ్ నీ సింప్లిసిటీకి హాట్స్ ఆఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అటు ఎస్పీ బాలు అంత్యక్రియలు తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో జరిగాయి. దీనికంటే ముందు బాలు కుటుంబ సభ్యులు వైదిక శైవ సంప్రదాయం ప్రకారం అంతిమ క్రతువు నిర్వహించారు. తమ అభిమాన గాయకుడిని చివరిసారిగా చూసేందుకు అటు అభిమానులు పోటెత్తారు. ఇక మా బాలు లేడని కన్నీటి పర్యంతం అయ్యారు.. ఎస్పీ బాలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నై లోని MGM ఆసుపత్రిలో శుక్రవారం మృతి చెందిన సంగతి తెలిసిందే!

Show Full Article
Print Article
Next Story
More Stories