దట్ ఈజ్ సూపర్ స్టార్.. అభిమాని గుండెల్లో దైర్యం నింపిన రజనీ!

దట్ ఈజ్ సూపర్ స్టార్.. అభిమాని గుండెల్లో దైర్యం నింపిన రజనీ!
x

Rajinikanth 

Highlights

Rajinikanth Surprises : రజనీకాంత్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు.. ఎన్నో సినిమాలతో, ఎన్నో పాత్రలతో మెప్పించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్నాడు.

Rajinikanth Surprises : రజనీకాంత్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు.. ఎన్నో సినిమాలతో, ఎన్నో పాత్రలతో మెప్పించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా కరోనా కారణంగా తన వీరాభిమాని మురళి ఒకరు ముంబైలోని ఆసుపత్రిలో చేరారు.. అతనికి ఇంకా యూరిన్‌ సమస్య కూడా ఉండటంతో ఆరోగ్యం మరింత విషమంగా మారింది. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా మురళి రజినీకాంత్ గురించి ఇలా రాసుకొచ్చాడు..

'2021లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలిచి అత్యుత్తమ నాయకుడు గాను, ఒక తండ్రిగా, ఆధ్యాత్మిక గురువుగా రాజ మార్గాన్ని ఏర్పరచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తికి రూ. 25 వేల ఆదాయం వచ్చే పరిస్థితిని తీసుకురావాలి. నీ సారథ్యంలో నడిచి సేవలు అందించలేకపోతున్నానని బాధపడుతున్నాను' అని పేర్కొన్నాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తన అభిమాని ఉన్నాడని తెలుసుకున్న రజనీకాంత్ తన అభిమానికి ధైర్యాన్నిచ్చే సందేశాన్ని పంపాడు 'నీకేం కాదు.. ధైర్యంగా ఉండు. అనారోగ్యం నుంచి త్వరలోనే కోలుకుంటావు. తరువాత కుటుంబ సమేతంగా మా ఇంటికి రండి. నేను నిన్ను చూస్తాను' అని వాయిస్ నోట్ పంపించారు రజినీ...

ఇక లాక్ డౌన్ సమయం కావడంతో సినిమా షూటింగ్ లు లేకపోవడంతో ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. త్వరలోనే ప్రారంభించనున్న రాజకీయ పార్టీ గురించి చర్చలు జరుపుతున్నారు. నవంబర్ లోపు రజినీకాంత్ తన పార్టీని ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అటు సినిమా చర్చల్లో కూడా రజినీకాంత్ బిజీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories