రజినీ పార్టీలో చేరుతా.. అయితే వన్ కండిషన్!

Raghava Lawrence : త్వరలోనే తానూ రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా సినీ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ తాజాగా వెల్లడించిన సంగతి

Krishna
Published on: 14 Sept 2020 2:24 PM IST
రజినీ పార్టీలో చేరుతా.. అయితే వన్ కండిషన్!
X

rajinikanth, raghava lawrence

Raghava Lawrence : త్వరలోనే తానూ రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా సినీ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ తాజాగా వెల్లడించిన సంగతి తెలిసిందే.. తన గురువు రజనీకాంత్ పార్టీలో చేరబోతున్నట్టుగా లారెన్స్ స్పష్టం చేశాడు. అయితే రజనీకాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే తాను ఆ పార్టీలో చేరుతానని, ఇతర వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తాను అంగీకరించబోనని లారెన్స్ ట్వీట్ చేశాడు. ఇది కేవలం తన ఒక్కడి అభిప్రాయం మాత్రం కాదని, అభిమానులందరి కోరిక అని వెల్లడించాడు లారెన్స్.

అయితే గతంలో తానూ ముఖ్యమంత్రి అభ్యర్ధిని కాదని, పార్టీలో అనుభవం ఉన్న వ్యక్తినే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తానని రజినీ వెల్లడించిన సంగతి తెలిసిందే.. అయితే రజినీ తన ప్రకటనని పునరాలోచిస్తారని ఆశిస్తున్నట్టుగా లారెన్స్ వెల్లడించాడు. భవిష్యత్తులో ఎవరైనా సీఎం అభ్యర్ధిగా ఉన్న పర్వాలేదు కానీ ఇప్పుడు రజినీ సీఎం అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా లారెన్స్ తెలిపాడు.. అటు రజినీ పార్టీలో చేరేందుకు సినీ ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్నారు.

తమిళనాడులో రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పైన చాలా ఆసక్తి నెలకొంది, అయన నవంబర్ లో కొత్త పార్టీని లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్లానింగ్ కూడా సిద్దం అయినట్టుగా సమాచారం.. అటు డాన్స్ మాస్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన లారెన్స్ ఆ తర్వాత నటుడుగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా ఎదిగాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో బాలీవుడ్ లో ఓ సినిమాని చేస్తున్నాడు లారెన్స్..

Krishna

Krishna

Next Story