Green India Challenge: సూపర్ స్టార్ ఛాలెంజ్ ను స్వీకరించిన సూపర్ స్టార్..

Green India Challenge: అమ్మాయిల కలల రాజకుమారుడు అతను.. అభిమానుల గుండెల్లో నిండిన శ్రీమంతుడు..

S. Srikanth
Published on: 11 Aug 2020 3:17 PM IST
Green India Challenge: సూపర్ స్టార్ ఛాలెంజ్ ను స్వీకరించిన సూపర్ స్టార్..
X
Vijay Accepts Mahesh Babu Green India Challenge

Green India Challenge: అమ్మాయిల కలల రాజకుమారుడు అతను.. అభిమానుల గుండెల్లో నిండిన శ్రీమంతుడు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ కి అతనో యువరాజు..హీరో ఎవరైనా సరే బాక్స్ ఆఫీస్ వద్ద అతని దూకుడుకి బ్రేక్ లేదు.. తెలుగు ప్రేక్షకులకి మాత్రం అతనో సూపర్ స్టార్ .. అతనే మహేష్ బాబు.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి రాజకుమారుడు నుంచి సూపర్ స్టార్ గా ఎదిగాడు మహేష్ బాబు.. అలాంటి మహేష్ బాబు ఈ రోజు 45 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు..

మహేష్ బాబు తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి తన నివాసంలో మొక్కలు నాటారు. అంతేకాదు మహేష్ ఈ ఛాలెంజ్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, తమిళ హీరో విజయ్, హెరాయిన్ శృతి హాసన్ లను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, మహేష్ విసిరిన ఛాలెంజ్ ను ఒక్క రోజులోనే స్వీకరించాడు తమిళ సూపర్ స్టార్ విజయ్. చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటాడు విజయ్. మహేష్ బాబు విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటానని విజయ్ తెలిపారు.

ఇందులో భాగంగా మహేష్ విసిరినా ఛాలెంజ్ కు శృతి హాసన్ స్పందించి త్వరలో మొక్కలు నాటుతానని తెలిపారు. జూనియర్ కూడా త్వరలోనే ఈ ఛాలెంజ్ ను స్వీకరించనున్నాడు. అంతే కాదు తమిళనాట గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోసం తన వంతు ప్రయత్నం చేసాడు సూపర్ స్టార్మ హేష్ బాబు.



S. Srikanth

S. Srikanth

Next Story