Mahesh Babu Birthday: మొక్కలు నాటి ఆ ముగ్గురిని నామినేట్ చేసిన మహేష్..

Mahesh Babu Birthday: అమ్మాయిల కలల రాజకుమారుడు అతను.. అభిమానుల గుండెల్లో నిండిన శ్రీమంతుడు.

S. Srikanth
Updated on: 9 Aug 2020 5:10 PM IST
Mahesh Babu Birthday: మొక్కలు నాటి ఆ ముగ్గురిని నామినేట్ చేసిన మహేష్..
X
Mahesh Babu Green India Challenge

Mahesh Babu Birthday: అమ్మాయిల కలల రాజకుమారుడు అతను.. అభిమానుల గుండెల్లో నిండిన శ్రీమంతుడు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ కి అతనో యువరాజు..హీరో ఎవరైనా సరే బాక్స్ ఆఫీస్ వద్ద అతని దూకుడుకి బ్రేక్ లేదు.. తెలుగు ప్రేక్షకులకి మాత్రం అతనో సూపర్ స్టార్ .. అతనే మహేష్ బాబు.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి రాజకుమారుడు నుంచి సూపర్ స్టార్ గా ఎదిగాడు మహేష్ బాబు.. అలాంటి మహేష్ బాబు ఈ రోజు 45 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు..

అయితే, మహేష్ బాబు తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి తన నివాసంలో మొక్కలు నాటారు. అంతేకాదు మహేష్ ఈ ఛాలెంజ్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, తమిళ హీరో విజయ్, హెరాయిన్ శృతి హాసన్ లను నామినేట్ చేశారు. ఈ విషయాన్నీ అయన స్వయంగా తన ట్విట్టర్ ద్వార తెలిపారు... " నా పుట్టినరోజును ఇంతకంటే బాగా సెలబ్రేట్ చేసుకోలేనేమో! అందుకే గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించాను. ఇప్పుడు ఈ చాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్, తమిళ హీరో విజయ్, శృతి హాసన్ లను నామినేట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని మిమ్మల్నిందరినీ కోరుతున్నాను. పచ్చని ప్రపంచం కోసం ఒక్క అడుగు ముందుకు వేద్దాం".. అంటూ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ రోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం సినిమాకి సంబంధించి మోషన్ పోస్టర్ తో ముందుకు వచ్చింది.. ఇది మహేష్ బాబు కు 27 వ చిత్రం.


గీతా గోవిందం ఫేం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది..ఈ సినిమాకి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. పక్కా సోషల్ మెసేజ్ తో ఈ సినిమా తెరకేక్కుతుందని తెలుస్తోంది. బ్యాంకింగ్ లోని లోపాలను ఎత్తి చూపుతూ ఈ కథ సాగనుందని సమాచారం..త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన అంచనాలు నెలకొన్నాయి.


S. Srikanth

S. Srikanth

Next Story