Sivakarthikeyan Fund Education Of Vadivel Balaji's kids : వడివేలు బాలాజీ పిల్లల్ని చదివిస్తానన్న హీరో!

Sivakarthikeyan Fund Education Of Vadivel Balaji's kids : ప్రముఖ తమిళ హాస్య నటుడు వడివేలు బాలాజీ కన్నుమూసిన సంగతి తెలిసిందే..

Krishna
Published on: 12 Sept 2020 10:28 AM IST
Sivakarthikeyan Fund Education Of Vadivel Balajis kids : వడివేలు బాలాజీ పిల్లల్ని చదివిస్తానన్న హీరో!
X

Sivakarthikeyan, Vadivel Balaji

Sivakarthikeyan Fund Education Of Vadivel Balaji's kids : ప్రముఖ తమిళ హాస్య నటుడు వడివేలు బాలాజీ కన్నుమూసిన సంగతి తెలిసిందే.. గురువారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన వయసు 45 సంవత్సరాలు.. దీనితో అయన మృతి పట్ల . కోలీవుడ్‌ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు... అయన భౌతికకాయానికి విజయ్‌ సేతుపతి, రోబో శంకర్‌, దివ్య దర్శిణి తదితరులు నివాళులర్పించారు. కొందరు ఆర్ధికంగా ఆదుకున్నారు.

అయితే అయన పిల్లలను చదివించేందుకు హీరో శివ కార్తికేయన్‌ ముందుకొచ్చారు.. వడివేలు బాలాజీ ఇద్దరు పిల్లల చదువుకు అయ్యే ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చారు. దీనితో శివ కార్తికేయన్‌ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వడివేలు బాలాజీ కి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయన పలు తమిళ చిత్రాల్లో నటించారు.

ముఖ్యంగా విజయ్ టీవీలో ప్రసారమయ్యే ఓ కామెడీ షోతో ఆయన చాలా పాపులర్ అయ్యారు. ఈ షోలో అయన ప్రముఖ కమెడియన్ అయిన వడివేలును అనుకరించేవారు. దీంతో ఆయనకు వడివేలు బాలాజీగా పేరొచ్చింది. ఇక గత 15 రోజుల క్రితం అయనకి గుండెపోటు రావడంతో పక్షవాతానికి గురయ్యారు. దీనితో చెన్నై ఆసుపత్రిలో అయన ఈ చేర్చారు అక్కడ కొన్ని రోజులు చికిత్స పొందారు.. ఆపై ఆర్థిక సమస్య వల్ల ఆయనని ఒమండురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే అయన చనిపోయారు.

Krishna

Krishna

Next Story