ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

Arun Chilukuri
Published on: 10 Sept 2020 5:53 PM IST
ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత
X

ప్రముఖ తమిళ హాస్య నటుడు వడివేల్‌ బాలాజీ కన్నుమూశారు. గురువారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం వడివేల్ బాలాజీకి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయనను.. చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. గత 15 రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పలు తమిళ చిత్రాల్లో వడివేల్ బాలాజీ నటించారు. విజయ్ టీవీలో ప్రసారమయ్యే ఓ కామెడీ షోతో ఆయన పాపులర్ అయ్యారు. తమిళంలో ప్రముఖ కమెడియన్ అయిన వడివేలును బాలాజీ అనుకరించేవారు. దీంతో.. ఆయనకు వడివేలు బాలాజీగా పేరొచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story