Sonu Sood Reveals About His Political Entry: పొలిటికల్ ఎంట్రీ పైన క్లారిటీ ఇచ్చిన సోనూసూద్ !

Sonu Sood Reveals About His Political Entry: కష్టం ఎక్కడుంటే నటుడు సోనూసూద్‌ అక్కడ ఉంటున్నాడు. లాక్ డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కూలీలు, కార్మికుల‌ను వారివారి స్వస్థలాలకు చేరుస్తూ

Krishna
Published on: 28 July 2020 12:40 PM IST
Sonu Sood Reveals About His Political Entry: పొలిటికల్ ఎంట్రీ పైన క్లారిటీ ఇచ్చిన సోనూసూద్ !
X
Sonu Sood Opens Up on his Political Entry

Sonu Sood Reveals About His Political Entry: కష్టం ఎక్కడుంటే నటుడు సోనూసూద్‌ అక్కడ ఉంటున్నాడు. లాక్ డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కూలీలు, కార్మికుల‌ను వారివారి స్వస్థలాలకు చేరుస్తూ వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు. సినిమాల్లో విలన్ అయినప్పటికీ అంద‌రి దృష్టిలో ఇప్పుడు రియల్ హీరోగా మారాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన, విన్నాగాని సోనూసూద్‌ పేరే వినిపిస్తుంది. దీనితో సోనూసూద్ రాజకీయాల్లోకి రావాలని సోనూసూద్ లాంటి నాయకుడు రాజకీయాల్లో అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కోరుతున్నారు.

అయితే తాజగా HMTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూసూద్ తన పొలిటికల్ ఎంట్రీ పైన స్పందించాడు. తనకి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని. ఇలాగే, సొసైటీకి మంచి చేయాలనీ ఉందని చెప్పుకొచ్చాడు. సమాజానికి మంచి చేయడానికి పొలిటికల్ లీడర్ కావాల్సిన అవసరం లేదని అన్నాడు. అంతేకాకుండా తానూ ఇంకా చేయాల్సిన సినిమాలు, పాత్రలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి అయితే రాజకీయాల్లోకి వెళ్ళే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చాడు సోనూసూద్..

లాక్ డౌన్ సమయంలో చాలా మంది వలస కూలీలను తమ సొంత గూటికి చేర్చిన సోనూసూద్ పైన శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేత నగ్మా గతంలో కీలక వాఖ్యలు చేశారు. రాజకీయ లబ్దికోసమే సోనూసూద్ ఈ సేవా కార్యక్రమాలను చేస్తున్నారని విమర్శించారు..అయితే వీటిపైన స్పందించిన సోనూసూద్.. ఇలాంటి విమర్శలే తనకి కొండంత బలమని అన్నారు.. మంచిపనులు చేసేటప్పుడు ఇలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయని, వాటిని తాను పట్టించుకోనని, మంచి ఆలోచనతో ప్రజలకు సేవ చేయాలని భావించినప్పుడు ఎంతో మంది వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తారని, ఇలాంటి విమర్శలు తనకి ఇంకా స్ఫూర్తిని ఇస్తాయని సోనూసూద్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు సోనూసూద్ .


Krishna

Krishna

Next Story