Sonu Sood Reaction: ఆ విమర్శలే నాకు కొండంత బలం : సోనూసూద్

Sonu Sood Reaction: కరోనా వైరస్ ను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా రెండు నెలల నుంచి లాక్ డౌన్ ల మీదా లాక్ డౌన్ లు విధిస్తూ ముందుకు వెళ్లడంతో వలస కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది..

Krishna
Published on: 26 Jun 2020 1:45 PM IST
Sonu Sood Reaction: ఆ విమర్శలే నాకు కొండంత బలం : సోనూసూద్
X

Sonu Sood Reaction: కరోనా వైరస్ ను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా రెండు నెలల నుంచి లాక్ డౌన్ ల మీదా లాక్ డౌన్ లు విధిస్తూ ముందుకు వెళ్లడంతో వలస కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది.. వారు ఉపాధి కోల్పోయి తినడానికి తిండి లేకా చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోవడంతో వారి బ్రతుకులు రోడ్డుమీద పడ్డాయి. దీంతో చేసేది ఏమీ లేక సొంత గ్రామాలకు కాలినడకన బయలుదేరాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది.. అలాంటి వారిని ఆదుకోవడం కోసం చాలా ముందుకు వచ్చి తమ గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. అందులో టాలీవుడ్ విలన్ సోనూసూద్ ఒకరు.

సొంత గూటికి చేరలేక బిక్కుబిక్కుమంటున్న వలస కార్మికులను వారి వారి స్వరాష్ట్రాలకు చేర్చి ఆదుకున్నారు సోనూసూద్.. దీనితో ఎక్కడ చూసినా సోనూసూద్ పేరు మారుమ్రోగింది..సినీ ఫీల్డ్ లో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో హీరో అనిపించుకున్నాడు సోనూసూద్.. అయితే అలాంటి సోనూసూద్ పైన ఇటీవల శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేత నగ్మా ఆయనను తప్పుబట్టారు. రాజకీయ లబ్దికోసమే సోనూసూద్ ఈ సేవా కార్యక్రమాలను చేస్తున్నారని విమర్శించారు..

అయితే ఈ విమర్శలపై తాజాగా సోనూసూద్ చాలా కూల్ గా స్పందించారు.. అలాంటి విమర్శలే తనకి కొండంత బలమని అన్నారు.. మంచిపనులు చేసేటప్పుడు ఇలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయని, వాటిని తాను పట్టించుకోనని, మంచి ఆలోచనతో ప్రజలకు సేవ చేయాలని భావించినప్పుడు ఎంతో మంది వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తారని, ఇలాంటి విమర్శలు తనకి ఇంకా స్ఫూర్తిని ఇస్తాయని సోనూసూద్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఇక టాలీవుడ్ లో సోనూసూద్ టాప్ విలన్ లలో ఒకరు.. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సోనూసూద్ ఆ తర్వాత ఆంజనేయులు, దూకుడు, ఆగడు, అరుంధతి సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు..


Krishna

Krishna

Next Story