కలకలం.. టాలీవుడ్ ప్రముఖునికి కరోనా?

Raj
By Raj
Published on: 20 Jun 2020 9:58 AM IST
కలకలం.. టాలీవుడ్ ప్రముఖునికి కరోనా?
X

దేశంలో ప్రస్తుతం కరోనా విళయ తాండవం చేస్తుంది. చిన్నా పెద్దా ముసలి ముతకా అనే తేడా లేకుండా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత ఒకరు కరోనా భారిన పడినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారట. దాంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు ఆ వార్తల సారాంశం. అయితే సదరు నిర్మాత మాత్రం దీనిపై ఇంకా వివరణ ఇవ్వలేదు.. ఆయన ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ వార్త సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.

ఆయన నివాసం ఉంటున్న ప్రాంతంలో ప్రముఖులు చాలా మంది నివాసం ఉంటున్నారు. దీంతో అంతా అప్రమత్తంయ్యరని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కాలనీ మొత్తం కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. కరోనా బారిన పడినట్టుగా చెబుతున్న నటుడు తన వ్యాపార అవసరాల నిమిత్తం తరచూ నగర శివారు ప్రాంతాలకు వెళ్లి వస్తూండేవారనీ.. ఈ నేపధ్యంలో అయన ఎవరెవరిని ఈ మధ్యకాలంలో కలిసి ఉంటారానే విషయాని ఆరా తీసి ఆయనను కలిసిన వారికీ కూడా కరోనా టెస్టులు చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

మొత్తమ్మీద తెలుగురాష్ట్రాల్లో తొలిసారిగా ఒక సినీ నటుడికి కరోనా సోకిందని వస్తున్న వార్తలతో అందరూ ఉలిక్కిపడుతున్నారు.

Raj

Raj

Next Story