Top
logo

Bigg Boss 3 Telugu Episode 56: నాగార్జున వచ్చారు క్లాసు పీకారు.. వరల్డ్ ఛాంప్ సింధు వచ్చారు ఇన్స్ పైర్ చేశారు!!

Bigg Boss 3 Telugu Episode 56: నాగార్జున వచ్చారు క్లాసు పీకారు.. వరల్డ్ ఛాంప్ సింధు వచ్చారు ఇన్స్ పైర్ చేశారు!!
Highlights

శనివారం బిగ్ బాస్ నాగార్జున క్లాసు పీకడం సాధారణం. ఈ ఎపిసోడ్ లో అది కొంచెం ఎక్కువగానే ఉంది. సీరియస్ గా గట్టిగా క్లాస్ పీకారు. ఇక బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపీ చంద్ బిగ్ బాస్ కి అకస్మాత్తుగా వచ్చి అందర్నీ ఆనంద పరిచారు.

బిగ్ బాస్ కి ఇన్విటేషన్ మీద వచ్చావు కదా.. ఆ ఇన్విటేషన్ చింపేశాను.. డోర్స్ ఓపెన్ ఉన్నాయి వెళ్ళు బయటకు.. మహేష్ కి నాగార్జున ఇచ్చిన డోసు.. బిగ్ బాస్ హౌస్ కి అథారిటీ బిగ్ బాస్ కానీ, నువ్వేంటి ఎక్కువ చేస్తున్నావ్? ఇటువంటివి ఇకమీద రానీయకు శ్రీముఖికి నాగ్ వార్నింగ్. అసలు పునర్నవీ ఏమనుకుంటున్నావ్? అటువంటి మాటలు మాట్లాడతావా? తప్పు కదూ మందలింపు. ఇలా మొదలెట్టారు శనివారం బిగ్ బాస్ ని నాగార్జున. వస్తూనే సీరియస్ నెస్ చూపించిన ఆయన కొద్ది సేపటికి మళ్లీ కూల్ అయిపోయారు.

వరల్డ్ ఛాంపియన్ పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్ లు అకస్మాత్తుగా షో కి వచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచారు. అందరికీ ఇన్స్పైర్ చేయడానికి సింధును తీసుకువచ్చినట్టు నాగార్జున చెప్పారు. సింధు కోసం రాహుల్ ని ఓ పాట పాడమన్నారు నాగార్జున. సింధు బాబా ఆ పాటకి డాన్స్ చేయాలని కోరింది. దానితో రాహుల్ పాట పాడుతుంటే.. బాబా డాన్స్ చేశారు.

ఇక అందరితో నాగార్జున మహానటి/నటుడు.. అంతకుమించి.. అనే ఆట ఆడించారు. అందులో పునర్నవి.. రాహుల్ ఇద్దరూ ఒకరిని ఒకరు అంతకు మించి అనే సిగ్మేంట్ లో పెట్టుకున్నారు.

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ లో ఉన్న పునర్నవి, మహేష్, శిల్ప చక్రవర్తి, హిమజ, శ్రీముఖి ఐదు గురిలో హిమజ సేఫ్ జోన్ లో ఉన్నట్టు నాగార్జున ప్రకటించారు.

ఈరోజు బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారని అనుకుంటున్నారు?Next Story