Opinion Poll: టీచర్స్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా?

సాధారణంగా రామ్ గోపాల్ వర్మ ఎవరినీ వదిలి పెట్టరు. అవకాశం వస్తే చాలు అందరినీ సోషల్ మీడియాలో ఆడేసుకుంటారు. చాలా మంది అయన ఆ విధానానికి అభిమానులుగా మారిపోయారు. కానీ, ఒక్కోసారి ఆ అభిమానులను కూడా షాక్ చేసే వ్యాఖ్యలు చేస్తారాయన. తాజాగా, టీచర్స్ డే సందర్భంగా అయన చేసిన ట్వీట్ లు సంచలనంగా మారాయి.

K V D Varma
Updated on: 5 Sept 2019 6:15 PM IST
Opinion Poll: టీచర్స్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా?
X

టీచర్స్ డే సందర్భంగా అందరూ తమకు పాఠాలు చెప్పిన టీచర్స్ కి ధన్యవాదాలు చెబుతారు. లేదా శుభాకాంక్షలు అందిస్తారు. ఇంకా కాకపొతే మాట్లాడకుండా కూచుంటారు. కానీ వివాదం అనే ట్యాగ్ లైన్ వేసుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం తనదియన శైలి లో స్పందించారు. తన ట్విట్టర్ ఎకౌంట్ లో టీచర్స్ విస్కీ బాటిల్ ఫోటో ముందు వర్మ ఉన్న ఫోటో పెట్టి ఆయన చేసిన వ్యాఖ్యల్ని పలువురు ఖండిస్తున్నారు.

'టీచర్స్ డే రోజు టీచర్లు టీచర్స్ విస్కీ తాగి సెలబ్రేట్ చేసుకుంటారా.. జస్ట్ ఆస్కింగ్' అంటూ వర్మ చేసిన వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? లేదా? అనే విషయాన్ని ఇక్కడ తెలియచేయండి.



వర్మ చేసిన ట్వీట్స్.. పూర్తి విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

K V D Varma

K V D Varma

Next Story