Nithin Invites CM KCR For His Marriage: నితిన్ పెళ్లి.. స్వయంగా ప్రగతిభవన్ కి వెళ్లి సీఎం కేసీఆర్ కి ఆహ్వానం !

Nithin Invites CM KCR For His Marriage: మొన్నటివరకు టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగిన యంగ్ హీరో నితిన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

Krishna
Updated on: 20 July 2020 10:36 PM IST
Nithin Invites CM KCR For His Marriage: నితిన్ పెళ్లి.. స్వయంగా ప్రగతిభవన్ కి వెళ్లి సీఎం కేసీఆర్ కి ఆహ్వానం !
X
Actor Nithin Invites Cm Kcr For His Marriage

Nithin Invites Cm Kcr For His Marriage: మొన్నటివరకు టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగిన యంగ్ హీరో నితిన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈనెల 26న తన ప్రేయసి షాలినితో నితిన్ పెళ్లి జరగబోతోంది. ఇప్పటికే ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. నితిన్ షాలినిల నిశ్చితార్థం ఫిబ్రవరి15న జరిగింది. ఇక ఏప్రిల్ 16 న వీరి వివాహాన్ని గ్రాండ్ గా దుబాయ్ లో చేయాలని ఇరువురు కుటుంబ సభ్యులు భావించారు. కానీ అప్పుడే దేశంలో కరోనా వ్యాప్తి ఎంటర్ కావడంతో వివాహాన్ని వాయిదా వస్తూ వచ్చారు.

ఇక తాజాగా హైదరాబాద్‌లో 26వ తేదీ రాత్రి 8.30 గంటలకు పెళ్లి ఫిక్స్ చేశారు. ఇక ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హీరో నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లి అక్కడ సీఎం కేసీఆర్‌ను కలిసి శుభలేఖను కేసీఆర్‌కు అందజేసీ వివాహానికి హాజరై ఆశీర్వదించాలని కోరారు.. తాజా సమాచారం ప్రకారం కేసీఆర్ వివాహానికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నితిన్ పెళ్లి జరుగుతుంది. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.

ఇక నితిన్ సినిమాల విషయానికి వచ్చేసరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ భారీ విజయాన్ని అందుకున్నాడు.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. రష్మీక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత గాంధీ మెర్లపాక దర్శకత్వంలో అందుధాన్ రీమెక్, విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాని లైన్ లో పెట్టాడు నితిన్.

Krishna

Krishna

Next Story