Nithiin Marriage Date Fixed: నితిన్ పెళ్లి ముహూర్తం ఫిక్స్!

Nithiin Marriage Date Fixed: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది.

Raj
By Raj
Updated on: 18 July 2020 8:27 PM IST
Nithiin Marriage Date Fixed: నితిన్ పెళ్లి ముహూర్తం ఫిక్స్!
X
Nithiin and Shalini (File Photo)

Nithiin Marriage Date Fixed: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 26 న హైదరాబాద్ లో వివాహం జరగనుందని కుటుంబసభ్యులు తెలిపారు. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు శాలినితో ఏడడుగులు వేయబోతున్నాడు నితిన్. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటిస్తూ కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహ తంతు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబసభ్యులు. ఈ వేడుక‌కు కేవ‌లం ఇరు కుటుంబాల‌ వారు, స‌న్నిహితులు హాజ‌రుకానున్నారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నితిన్‌, షాలిని ప‌సుపు కుంకుమ వేడుక జ‌రిగిన విష‌యం తెలిసిందే..

ఏప్రిల్ 16న దుబాయ్ వేదికగా నితిన్, షాలినిల వెడ్డింగ్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ముందుగా అనుకున్నా. కరోనా వైరస్ విజృంభణ, లాక్‌డౌన్‌ల కారణంగా నితిన్ పెళ్లిని, బర్త్ డే వేడుకలను వాయిదా వేశారు. మరోవైపు భీష్మ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను సొంతం చేసుకున్న నితిన్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ప్ర‌స్తుతం రంగ్ దే, చెక్ అనే రెండు భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. ఆ త‌ర్వాత మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో అంధాధున్ హిందీ రీమేక్‌, కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్పేట సినిమాలు చేయనున్నట్టు ఫిలిం నగర్ టాక్.




Raj

Raj

Next Story