Allu Arjun Plans to work with Koratala Shiva: అల్లు అర్జున్ తో కొరటాల మూవీ?

Actor Allu Arjun Plans to work with Koratala Shiva: మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను సినిమాలతో వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన దర్శకుడు కొరటాల ప్రస్తుతం తన అయిదవ సినిమాని మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నారు.

Krishna
Updated on: 15 July 2020 3:10 PM IST
Allu Arjun Plans to work with Koratala Shiva: అల్లు అర్జున్ తో కొరటాల మూవీ?
X
Actor Allu Arjun Plans to work with Koratala Siva, Geetha Arts To Produce This Film

Allu Arjun Plans to work with Koratala Shiva: మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను సినిమాలతో వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన దర్శకుడు కొరటాల ప్రస్తుతం తన అయిదవ సినిమాని మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నారు. ఈ సినిమాకి ఆచార్య అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా కూడా హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు.. అయితే ఈ సినిమా తరువాత కొరటాల ఎవరితో సినిమా చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తాను ఓ పది సినిమాలు మాత్రమే చేస్తానని, అవి సూపర్ డూపర్ హిట్ అవుతాయని, ఆ తర్వాత రిటైర్ అవుతానని వెల్లడించిన సంగతి తెలిసిందే..

అయితే తాజా సమాచారం ప్రకారం కొరటాల తదుపరి చిత్రం అల్లు అర్జున్ తో ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే కొరటాల చెప్పిన ఓ లైన్ అల్లు అర్జున్ కి బాగా నచ్చిందని ఫిల్మ్ నగర్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.. ఆచార్య సినిమాని కంప్లీట్ చేసి బన్నీ మూవీకి కొరటాల షిఫ్ట్ కానున్నాడని తెలుస్తోంది. కానీ దీనిపైనే అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది..

ఇక ప్రస్తుతం బన్నీ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రంతో భారీ హిట్ కొట్టి ప్రజెంట్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి పుష్ప అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కాగా సుకుమార్ తో మూడవ సినిమా.. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా వాయిదా పడింది..

Krishna

Krishna

Next Story