Acharya Movie Updates: ఆచార్యలో తమన్నా.. చిరుతో స్టెప్పులు?

Acharya Movie Updates: ఆచార్యలో తమన్నా.. చిరుతో స్టెప్పులు?
x
aacharya movie updates
Highlights

Acharya Movie Updates: సైరా నరసింహ రెడ్డి సినిమా తరవాత మెగాస్టార్ చిరంజీవి , దర్శకుడు కొరటాల శివతో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం

Acharya Movie Updates: సైరా నరసింహ రెడ్డి సినిమా తరవాత మెగాస్టార్ చిరంజీవి , దర్శకుడు కొరటాల శివతో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం.. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో ఓటమి లేని దర్శకుడిగా కొనసాగుతున్న కొరటాల శివ ఫస్ట్ టైం మెగాస్టార్ తో సినిమా చేస్తుండడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి మెలోడీ మాంత్రికుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది..

అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే ఈ సినిమాలో ఓ మాస్ మసాలా ఐటమ్ సాంగ్ కోసం హీరోయిన్ తమన్నాను తీసుకోవాలని అనుకుంటున్నాడట దర్శకుడు కొరటాల.. ఇప్పటికే సైరా చిత్రంలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న తమన్నా.. మరోసారి ఆయనతో కలిసి ఆడిపాడనుందని సమాచారం.. అయితే ఇంతకు ముందు ఓ ఐటమ్ సాంగ్ కోసం మరోనటి రెజీనాను తీసుకున్న సంగతి తెలిసిందే.. ఈ విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. మరిప్పుడు రెజీనా ప్లేస్లో తమన్నాను తీసుకున్నారా? లేకా ఇద్దరు బ్యూటీలతో రెండు స్పెషల్ సాంగ్స్ ఉంటాయా అన్నది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో చిరు పక్కన ఖైదీ నెంబర్ 150 సినిమాలో హీరోయిన్ గా మెరిసింది ఈ భామ.. ముందుగా ఈ సినిమా కోసం త్రిషను తీసుకున్నారు కానీ డేట్స్ అడ్జెస్ట్ అవ్వక ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చిత్రబృందం కాజల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసింది. . ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అక్రమాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది..

Show Full Article
Print Article
Next Story
More Stories