Tamanaah remuneration: ఓటీటీలో టాక్ షో కోసం తమన్నా భారీ రెమ్యునరేషన్?

Tamanaah remuneration: మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది మిల్కీ బ్యూటీ తమన్నా.

Krishna
Published on: 30 Jun 2020 7:45 PM IST
Tamanaah remuneration: ఓటీటీలో టాక్ షో కోసం తమన్నా భారీ రెమ్యునరేషన్?
X
Tamanna Bhatia (file photo)

Tamanaah remuneration: మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది మిల్కీ బ్యూటీ తమన్నా.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ తమన్నాకి మంచి బ్రేక్ ఇచ్చింది.. ఇక రామ్ చరణ్ తో రచ్చ, అల్లు అర్జున్ తో బద్రినాథ్, రవితేజతో బెంగాల్ టైగర్ మొదలగు సినిమాలు తమన్నాని స్టార్ హీరోయిన్ ని చేశాయి..తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అయిపోయింది. ప్రస్తుతం ఆమెకి అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఐటెం సాంగ్స్ లో కనిపిస్తోంది.. ఈ ఏడాది మహేష్ బాబు హీరోగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో 'డాంగ్ డాంగ్' అంటూ అదిరిపోయే స్టెప్పులతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.

ఇక తమన్నా త్వరలో ఓటీటీలోకి అడుగుపెడుతున్నట్టుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్‌ అహా అనే ఓటీటీని ఇటీవ‌ల మొదలుపెట్టారు. ఇందులో ప్రేక్షకులకు అనుగుణంగా వైవిధ్యభ‌రిత‌మైన కార్యక్రమానికి శ్రీ‌కారం చూడుతున్నారు అయన. ఈ నేపధ్యంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాతో స్పెషల్ గా ఓ టాక్ షో ని ప్లాన్ చేస్తున్నారని , ఇప్పటికే తమన్నాతో చర్చలు కూడా ముగిసాయని, దీనికి తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో మొత్తం 20 ఎపిసోడ్స్ కి ప్లాన్ చేస్తున్నారట.. ఒక్కో ఎపిసోడ్ కి గాను తమన్నా ఏడు లక్షల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ టాక్ షోలో అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ వంటి స్టార్ హీరోలను తమన్నా ఇంటర్వ్యూ చేయబోతున్నారని తెలిసింది.

ఇక ప్రస్తుతం తమన్నాకి ఒకప్పటిలాగా సినిమాలు ఏమీ లేవు.. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న సీటిమార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో హీరో గోపీచంద్ ఏపీ కబడ్డీ జట్టు కోచ్ గా కనిపించనుండగా, తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా కనిపించబోతుంది. సునీల్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. . దాదాపుగా షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. గౌతమ్ నంద చిత్రం తరవాత గోపిచంద్,సంపత్ నంది కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.


Krishna

Krishna

Next Story