Naandi Movie new look: 'నాంది'లో లాయర్ గా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్!

Naandi Movie new look: నాందిలో లాయర్ గా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్!
x
Highlights

Naandi Movie new look: సోలో హీరోగా మంచి హిట్టు కొట్టి చాలా రోజులైంది అల్లరి నరేష్.. గతేడాది మహేష్ బాబు హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి అనే సినిమాలో మ‌హేశ్‌బాబు స్నేహితుడిగా, ప‌ల్లెటూడి కుర్రాడిగా క‌నిపించి అంద‌రినీ మెప్పించాడు నరేష్.

Naandi movie new look: సోలో హీరోగా మంచి హిట్టు కొట్టి చాలా రోజులైంది అల్లరి నరేష్.. గతేడాది మహేష్ బాబు హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి అనే సినిమాలో మ‌హేశ్‌బాబు స్నేహితుడిగా, ప‌ల్లెటూడి కుర్రాడిగా క‌నిపించి అంద‌రినీ మెప్పించాడు నరేష్.. ప్రస్తుతం నరేష్ తనకి అచ్చొచ్చిన కామెడీ పాత్రలు కాకుండా పూర్తిగా రూట్ మార్చి కొత్త పంథాలో 'నాంది' అనే సినిమా చేస్తున్నాడు.. న‌రేష్ కెరియ‌ర్‌లో 57వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమాలో తమిళ నటి వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నసంగతి తెలిసిందే కదా..! తాజాగా ఆమెకి సంబంధించిన లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం.. ఇందులో ఆమె లాయ‌ర్ గా క‌నిపించ‌నుంది. వ‌ర‌లక్ష్మి ఓ చేత్తో ఫైల్, మ‌రో చేతితో న‌ల్ల కోటు ప‌ట్టుకుని న‌డుచుకుంటూ వస్తున్న లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇక రేపు (జూన్ 30) న అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన 'నాంది' ఎఫ్ఐఆర్ (ఫ‌స్ట్ ఇంపాక్ట్ రివీల్‌) పేరట గ్లింప్స్‌ వీడియోను విడుదల చేయనున్నట్లు మేక‌ర్స్ వెల్లడించారు... ఇప్పటికే ఫస్ట్ లుక్ , పోస్టర్లతో నాంది సినిమాపై చాలా అంచనాలు పెంచిన మేకర్స్ ఇక విడుదల చేయబోయే వీడియోపై చాలా ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్ ద‌గ్గర కో-డైరెక్టర్‌గా ప‌నిచేసిన విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న ఈ సినిమాని నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో హ‌రీష్ ఉత్తమ‌న్‌, ప్రియ‌ద‌ర్శి, ప్రవీణ్ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories