Allari Naresh Naandhi Movie: అంచనాలు పెంచేసిన అల్లరి నరేష్ 'నాంది ' మూవీ లుక్..

Allari Naresh Naandhi Movie: దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ కొడుకుగా అల్లరి సినిమాతో హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లరినరేష్.. మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి అందరినీ ఆకట్టుకున్నాడు..

Krishna
Updated on: 28 Jun 2020 1:51 PM IST
Allari Naresh Naandhi Movie: అంచనాలు పెంచేసిన అల్లరి నరేష్ నాంది  మూవీ లుక్..
X

Allari Naresh Naandhi Movie: దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ కొడుకుగా అల్లరి సినిమాతో హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లరినరేష్.. మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి అందరినీ ఆకట్టుకున్నాడు.. ఆ తర్వాత తొట్టి గ్యాంగ్ , ప్రాణం, మా అల్లుడు వెరీ గుడ్ మొదలగు సినిమాలలో నటించి హీరోగా నిలదొక్కుకున్నాడు.. అంతేకాకుండా కామెడీ హీరో అనే పేరును సైతం తెచ్చుకున్నాడు. ఇక అల్లరి నరేష్ తో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకాన్ని ప్రొడ్యూసర్లకి కల్పించాడు నరేష్.. ఇదే క్రమంలో అతి తక్కువ టైంలో 50 సినిమాలను కంప్లీట్ చేశాడు..

అయితే అల్లరి నరేష్ సోలో గా హిట్ కొట్టి చాలా రోజులైందని చెప్పాలి.. గతేడాది మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి అనే సినిమాలో రవి అనే పాత్రను పోషించి మళ్లీ కం బ్యాక్ అనిపించాడు నరేష్.. ఆయితే ప్రస్తుతం నరేష్ తనకి అచ్చొచ్చిన కామెడీ పాత్రలు కాకుండా పూర్తిగా రూట్ మార్చి కొత్త పంథాలో ఓ సినిమా చేస్తున్నాడు.. న‌రేష్ కెరియ‌ర్‌లో 57వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్ ని మేకర్స్ విడుద‌ల చేశారు. ఇందులో అల్లరి నరేష్ పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా కింద కూర్చుని ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది.

ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్ ద‌గ్గ‌ర కో-డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న ఈ సినిమాని నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో నరేష్ తో పాటుగా వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, హ‌రీష్ ఉత్తమ‌న్‌, ప్రియ‌ద‌ర్శి, ప్రవీణ్ కీల‌క పాత్రలు పోిస్తున్నారు.. అయితే ఈ నెల 30న అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన 'నాంది' ఎఫ్ఐఆర్ (ఫ‌స్ట్ ఇంపాక్ట్ రివీల్‌) పేరట గ్లింప్స్‌ వీడియోను విడుదల చేయనున్నట్లు మేక‌ర్స్ వెల్లడించారు... ఇప్పటికే ఫస్ట్ లుక్ , పోస్టర్లతో నాంది సినిమాపై చాలా అంచనాలు పెంచిన మేకర్స్ ఇక విడుదల చేయబోయే వీడియోపై చాలా ఆసక్తి నెలకొంది.

దాదాపుగా షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు..





Krishna

Krishna

Next Story