కామెడీని పక్కన పెట్టిన అల్లరోడు

కామెడీని పక్కన పెట్టిన అల్లరోడు
x
Highlights

హీరో రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ సినిమాలనే తీస్తూ మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు అల్లరి నరేష్.

హీరో రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ సినిమాలనే తీస్తూ మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు అల్లరి నరేష్.. ఇక ప్రేక్షకులు కూడా అల్లరి నరేష్ సినిమా వస్తుంది అంటే చాలు రెండున్నర గంటలు హాయిగా నవ్వుకోవచ్చు అనే భరోసాని కలిపించాడు. చాలా తక్కువ టైంలోనే 50 సినిమాలను కంప్లీట్ చేసి ఆకట్టుకున్నాడు. ఇక తర్వాత రొటీన్ సినిమాలు వస్తుండడంతో అల్లరోడు విజయాల విషయంలో కాస్తా వెనుకబడ్డాడు.

సుడిగాడు సినిమా తర్వాత అల్లరి నరేష్ కి చెప్పుకోదగ్గ హిట్టు అయితే లేదు. ఈ నేపధ్యంలో మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు. ఆ పాత్రకి గాను అల్లరి నరేష్ కి మంచి పేరు వచ్చింది. చాలా రోజుల తర్వాత సక్సెస్ రావడంతో కథల ఎంపికలో జాగ్రత్తలు వ్యవహరిస్తున్నాడు నరేష్ అందులో భాగంగానే ఇప్పుడు బంగారు బుల్లోడు అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత మరో ఆసక్తికరమైన సినిమాకి శ్రీకారం చూట్టాడు అల్లరి నరేష్. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో ఓ డిఫరెంట్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా జనవరి 20 న (సోమవారం) రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో అల్లరి నరేష్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. మోసగాళ్లకు మోసగాడు, ఒక్క క్షణం సినిమాలకి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సతీష్‌ వేగేశ్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ప్రముఖ పాత్రలో నటిస్తోంది. శ్రీ చరణ్‌ పాకల సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాని ఈఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories