Allu Arjun ButtaBomma Song New Record: బుట్ట‌బొమ్మ పాటకి మరో రికార్డు దాసోహం..

Allu Arjun ButtaBomma Song New Record: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠ‌పుర‌ములో

Krishna
Published on: 4 July 2020 12:30 PM IST
Allu Arjun ButtaBomma Song New Record: బుట్ట‌బొమ్మ పాటకి మరో రికార్డు దాసోహం..
X

Allu Arjun ButtaBomma Song New Record: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చి అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా బుట్టబొమ్మ, రాములో రాములా, సామజవరగమన పాటలు రికార్డుల మీదా రికార్డులు సృష్టించాయి. ఇంకా సృష్టిస్తునే ఉన్నాయి . ముఖ్యంగా ఇందులోని బుట్టబొమ్మ పాట అయితే ప్రపంచ దేశాలను ఊపు ఉపేసింది.

అయితే తాజాగా ఈ బుట్టబొమ్మ పాట మరో రికార్డును సృష్టించింది.. వరల్డ్ వైడ్‌గా అత్యంత ప్రాచుర్యం పొందిన 100 వీడియో సాంగ్స్‌లో ఈ పాట 15వ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఈ పాట 2 మిలియన్ లైక్స్ మార్కుకు దగ్గరగా ఉంది. ఫిబ్ర‌వరి 25న బుట్ట‌బొమ్మ వీడియో సాంగ్‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా ప్ర‌స్తుతం ఈ సాంగ్ 250 మిలియ‌న్స్‌‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టి స‌రికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ పాటను అర్మాన్‌ మాలిక్‌ అలపించగా, రామజోగయ్య శాస్త్రి రచించారు.. జానీ మాస్టర్ కంపోజ్ చేశారు. బుట్టబొమ్మ పాట ఇన్ని రికార్డ్స్ సృష్టించడం పట్ల చిత్ర బృందం వ్యక్తం చేస్తుంది..

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు. ఆర్య , ఆర్య 2 సినిమాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో బన్నీ సరసన రష్మీక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఇక అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..


Krishna

Krishna

Next Story