Top
logo

Live Updates:ఈరోజు (జూలై-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూలై-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు ఆదివారం, 12 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం సప్తమి(మ. 2-36 వరకు) తర్వాత అష్టమి, ఉత్తరాభాద్ర నక్షత్రం (ఉ.8-09 వరకు) తర్వాత రేవతి నక్షత్రం.. అమృత ఘడియలు (ఉ. 8-05 నుంచి 9-51 వరకు), వర్జ్యం (రాత్రి 9-27 నుంచి 11-13 వరకు) దుర్ముహూర్తం (సా. 4-51 నుంచి 5-43 వరకు) రాహుకాలం (సా.4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-35

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • 12 July 2020 12:49 PM GMT

  శంషాబాద్ వద్ద కంటేనర్‌లో చేలరేగిన మంటలు

  రంగారెడ్డి జిల్లా బెంగుళూరు హైవే పై శంషాబాద్ మండలం లో ఓకే కంటైనర్ లో మంటలు చెలరేగాయి. అది గమనించిన డ్రైవర్ కంటైనర్ ను రోడ్ పక్కన పార్క్ చేసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు ఫైర్ సిబ్బందిని రప్పించి మంటలను అదుపు చేసారు. బెంగుళూరు నుంచి మైక్రో ల్యాబ్ కు సంబందించిన ట్యాబు లేట్ లోడ్ తో వెళ్తున్నట్లు గా డ్రైవర్ తెలిపాడు.

 • గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  12 July 2020 12:40 PM GMT

  గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. కరోనా బాదితులకు వైద్యం అందిస్తున్న తీరు, వార్డుల్లో ఉన్న వసతులును పరిశీలించారు. అనంతరం సూపర్ఇండెంట్, ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా పలు కోవిద్ ఆసుపత్రులను సందిర్శించిన కిషన్ రెడ్డి బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.


 • 12 July 2020 11:30 AM GMT

  మాస్కు ధరించకుంటే జరిమానా కట్టాల్సిందే

  ఘంటసాల: కరోన నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించి బయటకు రావాలని లేకపోతే జరిమానా కట్టాల్సి వస్తుందని ఘంటసాల ఎస్ఐ టి.రామకృష్ణ తెలిపారు.

  - ఘంటసాల సెంటర్లో లాక్ డౌన్ కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం షాపులన్ని మూసివేశారు.

  - ఈ సందర్భంగా ప్రధాన సెంటర్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించి మాస్కులు ధరించిన వాహనదారులకు, నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధించింది కౌన్సెలింగ్ ఇచ్చారు.

  - కరోన కట్టడికి పోలీసులకు, అధికారులకు ప్రజలు సహకరించాలని ఎస్ ఐ రామకృష్ణ కోరారు. • 12 July 2020 11:22 AM GMT

  పశ్చిమ గోనగూడెంలో వైద్య శిబిరం ఏర్పాటు

  కోరుకొండ: కోరుకొండ మండలం పశ్చిమగోన గూడెంలో ఆదివారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు గ్రామ కార్యదర్శి కనకదుర్గ తెలియజేశారు.

  - గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ నమోదు కావడంతో ముందస్తు చర్యల్లో భాగంగా క్యాంప్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే శానిటేషన్ చర్యలు తీసుకున్నట్లు ఆమె వివరించారు. • అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
  12 July 2020 11:09 AM GMT

  అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

  అంబాజీపేట: మండలంలోని మాచవరం గ్రామపంచాయతీ పరిధిలోని కోఠివారి అగ్రహారంలో ఒక వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానిక ఎస్.ఐ షేక్ జానీ బాషా సిబ్బందితో కలిసి మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

  - దీనికి సంబంధించి ఎస్.ఐ జానీ బాషా తెలిపిన వివరాల ప్రకారం కోఠివారి అగ్రహారంలో మద్యం విక్రయిస్తున్న వాసంశెట్టి వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసి, మద్యాన్ని సీజ్ చేశామని తెలిపారు. అదుపులో తీసుకున్న వ్యక్తిని రిమాండ్ కు తరలిస్తున్నామని తెలియజేశారు.

  - ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎవరైనా అక్రమంగా మద్యాన్ని నిల్వచేయడం, విక్రయించటం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వారి వివరాలు నా ఫోన్ నెంబర్ 944 0796 563కు తెలియజేయాలని జానీ బాషా తెలిపారు.

 • 12 July 2020 10:29 AM GMT

  ఆటోను ఢీకొట్టిన లారీ, ముగ్గురి దుర్మరణం

  - వ్యవసాయం చేసుకుంటూ.. వచ్చిన పంటను అమ్ముకొని కాలం వెళ్లదీస్తున్న వారికి లారీ రూపంలో వచ్చిన మృత్యువు.. వారి పాలిట యమపాశమైంది.

  - అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బత్తలపల్లి మండల కేంద్రం సమీపంలో ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

  - పూర్తి వివరాలు 

 • 12 July 2020 10:27 AM GMT

  ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

  - ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

  - గత 24 గంటల్లో మొత్తం 17,624 నమూనాలను పరీక్షించగా 1,914 మందికి కోవిడ్-‌19 నిర్ధారణ అయింది.

  - అయితే గతంలో కరోనా భారిన పడిన 846 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని డిశ్చార్ట్‌ అయ్యారు.

  - రాష్ట్రంలో 11,071 మంది ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

  - 2,357 మంది వివిధ జిల్లాల్లోని కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ లో చికిత్స పొందుతున్నారు.

  - పూర్తి వివరాలు 

 • 12 July 2020 10:12 AM GMT

  టీటీడీ సిబ్బందిలో 91 మందికి కరోనా!

  - టీటీడీలో పని చేస్తున్న 98 మందికి కరోనా సోకింది.

  - ఈ విషయాన్ని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. దీనితో ఉద్యోగులకి మరిన్ని ఎక్కువ టెస్టులు చేయాలనీ అధికారులకి సూచించినట్టుగా అయన వెల్లడించారు.

  - అయితే అనంతపురం, కడప జిల్లాలకు చెందిన ఎస్పీఎఫ్ సిబ్బంది సెలవులకి వెళ్లి తిరిగి రావడంతో టీటీడీలో కరోనా సోకిందని అయన అన్నారు.

  - పూర్తి వివరాలు 

 • క‌రోనాపై అంతిమ విజ‌యం మ‌న‌దే: శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని
  12 July 2020 10:09 AM GMT

  క‌రోనాపై అంతిమ విజ‌యం మ‌న‌దే: శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని

  చిలకలూరిపేట: క‌రోనాపై అంతిమ విజ‌యం మ‌న‌దేన‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు.

  - క‌రోనా మ‌హ‌మ్మారిపై ప్ర‌పంచం విజ‌యం సాధించాల‌ని, మ‌న దేశం శ‌త్రువులను దీటుగా ఎదుర్కోవాల‌ని ఆకాంక్షిస్తూ స్థానిక ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో ఆదివారం ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

  - తొలుత ఎమ్మెల్యే ర‌జినిని ఆల‌య అధికారులు, ధ‌ర్త‌క‌ర్త పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం స్వామివారికి అభిషేకాలు నిర్వ‌హించారు.

  - ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క‌రోనాను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేలా ప్ర‌జ‌లంద‌రికీ త‌గిన శ‌క్తిని ఇవ్వాల‌ని స్వామి వారిని కోరుకున్న‌ట్లు చెప్పారు.

  - మ‌న దేశంపై గెలిచే స‌త్తా ఎవ‌రికీ లేద‌ని, భార‌త‌దేశం ఎప్ప‌టికీ సుర‌క్షితంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

  - ఆటుపోట్లు స‌హ‌జంగా వ‌స్తుంటాయ‌ని, వాటిని త‌ట్టుకునేందుకు అంద‌రం ఎప్పుడూ సిద్ధంగా ఉండాల్సిందేన‌ని వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త‌లు, ఈవో ప్ర‌సాద్‌, దేవాదాయ సిబ్బంది ఉన్నారు. 
 • 12 July 2020 3:02 AM GMT

  కృష్ణమ్మకు వరద.. నిండుతున్న ప్రాజెక్టులు

  - భారీ వర్షాల కారణంగా కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ వరద నీటితో కళకళలాడుతున్నాయి.

  - ఒక పక్క కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలంతా ఆందోళనలో ఉన్నా, ఈ ప్రాజెక్టులన్నీ నిండుతుతండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  - కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. బిరబిరా ప్రవహిస్తోంది. క‌ృష్ణా నదిలోకి వరద ప్రవాహం పెరుగుతోంది.

  - పూర్తి వివరాలు  

Next Story