Live Updates:ఈరోజు (జూలై-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూలై-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు ఆదివారం, 12 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం సప్తమి(మ. 2-36 వరకు) తర్వాత అష్టమి, ఉత్తరాభాద్ర నక్షత్రం (ఉ.8-09 వరకు) తర్వాత రేవతి నక్షత్రం.. అమృత ఘడియలు (ఉ. 8-05 నుంచి 9-51 వరకు), వర్జ్యం (రాత్రి 9-27 నుంచి 11-13 వరకు) దుర్ముహూర్తం (సా. 4-51 నుంచి 5-43 వరకు) రాహుకాలం (సా.4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-35

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • ఆంధ్రప్రదేశ్ లో బి.జె.పి., జనసేన పార్టీ కీలక నేతల సమావేశం
    12 July 2020 3:57 PM GMT

    ఆంధ్రప్రదేశ్ లో బి.జె.పి., జనసేన పార్టీ కీలక నేతల సమావేశం

    అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని బి.జె.పి., జనసేన పార్టీ కీలక నేతల సమావేశం

    - వీడియో కాన్ఫరెన్స్ లో బి.జె.పి. పార్టీ నుంచి పాల్గొన్న సతీష్ జీ, సునీల్ దియోధర్, జి.వి.ఎల్.నరసింహ రావు, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, సోము వీర్రాజు, మధుకర్,

    - జనసేన నుంచి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

    - కరోనా అరికట్టడంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సమర్థంగా పనిచేయడం లేదు

    - ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు బి.జె.పి., జనసేన నిర్ణయం

    - పరీక్షల సంఖ్య పెరిగినప్పటికీ వేగంగా విస్తరిస్తున్న వ్యాధిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా పని చేయడం లేదు

    - వ్యాధి నివారణలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది రక్షణలో సర్కారు వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది

    - ఈ విపత్కాలంలో నరేంద్ర మోదీ గారు ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అమలు అవుతుందో అధ్యయనం చేసిన తరువాత వాటి వివరాలను మీడియాతో పంచుకోవాలని నిర్ణయం

    - ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు లబ్ధిదారులకు అందించ లేకపోయింది

    - ఈ ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 9 వేల కోట్ల రూపాయలను అందించింది

    - రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాలని నిర్ణయం

    - కార్యాచరణను సిద్ధం చేయడానికి మరోసారి సమావేశం కానున్న ఇరు పార్టీ ల‌ నేతలు

  • సాగునీటి ప్రాజెక్టులపై సిఎం కేసీఆర్ సమీక్ష
    12 July 2020 3:51 PM GMT

    సాగునీటి ప్రాజెక్టులపై సిఎం కేసీఆర్ సమీక్ష

    ప్రగతి భవన్: ఇటీవల ముఖ్యమంత్రితో ఫోన్లో సంభాషించిన కతలాపూర్ జడ్పీటిసి భూమయ్య, రైతు శ్రీపాల్ లను కూడా సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన సిఎం కేసీఆర్

    - ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలను వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు అందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి

    - వీలైంతన ఎక్కువ మంది రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి మరోటి లేదు

    - ఎంత ఖర్చయినా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది

    - ఈ ఏడాది కృష్ణా నదిలో కూడా ఎక్కువ నీటి లభ్యత ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నారాయణ పూర్ రిజర్వాయర్ నుంచి నీరు వదిలారు.

    - కాబట్టి వెంటనే జూరాల, భీమా 2 లిఫ్టుల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలించాలి. రామల్పాడు రిజర్వాయర్ నింపాలి.

    - కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ డి 82 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను వేగంగా పూర్తి చేసి, ఈ ఏడాదే 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలి.

    - కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్ నిర్మించాలి. లేదంటే చెరువుల సామర్థ్యం పెంచాలి

    -  ప్రాజెక్టుల నీటితో ముందుగా చెరువులు నింపాలని, తర్వాత రిజర్వాయర్లు నింపాలని, చివరికి ఆయకట్టుకు అందించాలి

    - శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పరిధిలోని వరద కాలువకు వీలైనంత ఎక్కువ ఓటిలు ఏర్పాటు చేసి, ఇతర స్కీములతో సాగునీరు అందని ప్రాంతాల చెరువులను నింపాలి

    - నీటి పారుదల శాఖలోని అన్ని విభాగాలను వెంటనే ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని ఆదేశం

    - ఎస్ఆర్ఎస్పి పరిధిలోని వరద కాలువ, కాకతీయ కాలువ మధ్య దాదాపు 139 చెరువులున్నాయి.

    - వాటిలో కొన్నింటికి నీరు అందడం లేదు. అలా నీరు అందని చెరువులను గుర్తించాలి. వరద కాలువకు వీలైనన్ని ఎక్కువ ఓటిలు పెట్టి ఆ చెరువులన్నింటినీ నింపాలి.

    - ఈ పని రాబోయే మూడు నాలుగు నెలల్లో పూర్తి కావాలి. అటు ఎస్ఆర్ఎస్పి నుంచి, ఇటు కాళేశ్వరం నుంచి వరద కాలువకు నీరందే అవకాశం ఉంది

    - వరద కాలువ 365 రోజుల పాటు సజీవంగా ఉంటుంది. కాబట్టి వరద కాలువ ద్వారా ఇప్పటి వరకు ఇతర స్కీముల ద్వారా నీరందని ప్రాంతాలకు నీరు ఇవ్వాలి.

    - వరద కాలువ, కాకతీయ కాలువ మధ్య భాగంలోనే కాకుండా, వరద కాలువ దక్షిణ భాగంలో ఇతర స్కీముల ద్వారా నీరందని ప్రాంతాలను గుర్తించి వరద కాలువ ద్వారా ఆయా ప్రాంతాల్లోని చెరువులను నింపాలి. ఈ పని ఆరు నెలల్లో పూర్తి కావాలి.

    - ఎల్లంపల్లి నుంచి అందే నీటి లభ్యతకు మించి ఆయకట్టును ప్రతిపాదించారు. దాన్ని మార్చాలి. ఎల్లంపల్లి నుంచి 90 వేల ఎకరాల లోపే ఆయకట్టుకు నీరందిండం సాధ్యమవుతుంది.

    -  మిగతా ఆయకట్టుకు ఎస్ఆర్ఎస్పి ద్వారా నీరు అందించాలి

  • అరవింద్ పై విద్రోహ శక్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం- సోయం బాపురావు
    12 July 2020 2:26 PM GMT

    అరవింద్ పై విద్రోహ శక్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం- సోయం బాపురావు

    ఆదిలాబాద్:వరంగల్ జిల్లాలో నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై విద్రోహ శక్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

    ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై నిలదీస్తున్న బిజెపి నాయకుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ భౌతిక దాడులు చేయడం పిరికిపంద చర్య.

    దాడికి పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.

    ....ప్రకటన విడుదల చేసిన సోయం బాపురావు, పార్లమెంట్ సభ్యులు అదిలాబాద్.

  • ఏపి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కామెంట్స్..
    12 July 2020 2:22 PM GMT

    ఏపి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కామెంట్స్..

    తూర్పుగోదావరి : కాకినాడలో ఏపి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కామెంట్స్..

    రైతు రుణమాఫీ మీద కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి..

    కేంద్రప్రభుత్వం 5 శాతం రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం కలిసి సున్నా వడ్డీ ద్వారా రైతు రుణమాఫీ సక్రమంగా అందిస్తున్నాము..

    చంద్రబాబు హయాం లో సున్నా వడ్డీ గాలికి వదిలేసి నప్పుడు ఈ పత్రికలు ఏమైపోయాయి..

    రైతులు మీద చిన్న చూపు వలన ఎన్నికల్లో ఇచ్చినా హామీలు అమలు చేయలేదు..

    చంద్రబాబును నమ్మి రైతులు మోసపోయారు..

    2014-19 వరకు 15000 కోట్ల రూపాయిలు బడ్జెట్ లో ఉంచి 600 కోట్ల మాత్రమే రైతులకు చెల్లించారు..

    రైతులను నిట్ట నిలువునా మోసం చేసిన ఘనత చంద్రబాబుది..

    చంద్రబాబు హాయం లో మోసపోయినా రైతులను ఆదుకున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి..

    రైతు బరోసా కేంద్రం ద్వారా సున్నా వడ్డీ పధకం రైతులకు అందజేస్తున్నము..

    యనమల రామకృష్ణుడుకు తెలిసిన జిమ్మిక్కులు, దొంగ లెక్కలు మాకు తెలియవు..

    యనమల లా మసిపూసి మారెడు చెయ్యడం మాకు రాదు..

    ఇచ్చిన హామీ సక్రమంగా నెరవేర్చడం తప్పా?

    కరిఫ్ నుంచి రబీ వరకు అన్ని పంటలకు విత్తనాలు నుంచి లోన్ల వరకు రైతు బరోనా కేంద్రాలు ద్వారా రైతులకు సకాలంలో అందిస్తున్నాము..

    రైతు బరోసా కేంద్రం ద్వారా రైతులకు అన్ని లోన్లు నేరుగా అందిస్తున్నాము..

    వారి వివరాలు రైతు బరోసా కేంద్రాల వద్ద ఉంచుతున్నాము..

    రైతుల కోసం ప్రభుత్వం ప్రకటించిన లోన్లు, పధకం అందకపోయినా 155251 కాల్ సెంటర్ కి కాల్ చేసి పిర్యాదు చేయ్యవచ్చు..

    తూర్పుగోదావరి జిల్లా డి.సి.సి బ్యాంకు ద్వారా 83 కోట్ల 70 లక్షలు సున్నా వడ్డీ బకాయిలు విదుదల చెయ్యడం వలన జిల్లా లోని ప్రైమరీ అగ్రికల్చరల్ సొసైటిలు బలోపేతం అయ్యాయి..

    రేపటి నుంచి రెవిన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తoగా "ఈ" పంట ద్వారా ఏ గ్రామం లో ఏ పంట వేస్తున్నారో సమచారం సేకరిస్తున్నారు..

    ఈ విధానం ద్వారా కౌలు రైతులకు లబ్ది చేరుతుంది..

  • బీజేపీ మీడియా స్టేట్మెంట్, కె.కృష్ణసాగర్ రావు,బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.
    12 July 2020 2:20 PM GMT

    బీజేపీ మీడియా స్టేట్మెంట్, కె.కృష్ణసాగర్ రావు,బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.

    - నిజామాబాద్ ఎంపీ,బిజేపీ నాయకులు అరవింద్ పై టిఆర్ ఎస్ దుండగులు వరంగల్ లో దాడి చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది

    - ఆత్మనిర్భర్ భారత్ గురించి మీడియా సమావేశంలో మాట్లాడటానికి వరంగల్ అర్బన్ బీజేపీ కార్యాలయానికి అరవింద్ వెళ్లారు

    - ఒక ఎంపీ పై టీఆర్ ఎస్ కార్యకర్తలు పట్టపగలే దాడిచేశారంటే ఇది ఖచ్చితంగా వరంగల్ పోలీసుల వైఫల్యమే అని బీజేపీ భావిస్తుంది

    - ఈ దాడికి పాల్పడ్డ టిఆర్ ఎస్ కార్యకర్తలను తక్షణమే అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది

  • టీఆర్ ఎస్ కిరాయి గూండాలు బీజేపీ ఆఫీస్-ఎంపీ అరవింద్ పై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం-  బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ
    12 July 2020 2:13 PM GMT

    టీఆర్ ఎస్ కిరాయి గూండాలు బీజేపీ ఆఫీస్-ఎంపీ అరవింద్ పై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం- బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ

    తెలంగాణ ప్రజలు కరోనాకు భయపడితే- కేసీఆర్, టీఆర్ ఎస్ కు బీజేపీ భయం పట్టుకుంది.

    బీజేపీ నేతలు-కార్యకర్తల పై అక్రమ కేసులు పెట్టినా బీజేపీ ఎప్పుడు రాజ్యాంగాన్ని అతిక్రమించలేదు

    సిద్ధాంతం కలిగిన పార్టీ బీజేపీ-టీఆరెస్ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవు!.

    బీజేపీ పై దాడులకు పాల్పడుతే సరైన సమాధానం చెప్పాల్సి ఉంతుంది..!ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు.

    దాడులతో ప్రతిపక్షాలను-బీజేపీని కట్టడి చేద్దామనుకోవడం మూర్ఖత్వం.

    ఎంఐఎం పార్టీ గూండాలు దేవాలయంకు వెళ్లి హత్యచేస్తే కనీసం స్పందించని పార్టీ టీఆర్ ఎస్

    ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా రాష్ట్రం ఉండాలని బీజేపీ కోరుకుంటుంది.

    పోలీస్ అధికారుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయి

    పక్కా ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడ్డారు!.

    ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసుల పై ఉంది.

    కేంద్రం లో బీజేపీ అధికారంలో ఉన్నదనే విషయాన్ని టీఆర్ ఎస్ మర్చిపోవద్దు.

    బీజేపీ నేతల పై దాడి విషయం పై కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తాం.

    టీఆర్ ఎస్ నేతలు అవినీతికి పాల్పడలేదని నిరూపించుకోవాల్సిన భాద్యత వాళ్ళ పై ఉంది.

    రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ వాటా లేని పథకాలు ఎన్నో చెప్పాలి?

    కరోనా దృష్టిని ప్రజల నుంచి మళ్లించడానికి సెక్రటేరియట్ కూల్చుతున్నారు!.

  • వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడండి . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సీఎల్పీ నేత భట్టి వినతి.
    12 July 2020 2:05 PM GMT

    వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడండి . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సీఎల్పీ నేత భట్టి వినతి.

    బీమాకోరేగావ్‌ కేసులో 2018 ఆగస్టులో అరెస్టయిన ప్రముఖ రచయిత, విరసం నాయకులు, పౌర హక్కుల నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలి.

    ప్రస్తుతం ముంబయిలోని తలోజా జైలులో ఉన్న వరవరరావును మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని, లేకపోతే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

    తెలంగాణ పౌర సమాజం పక్షాన పౌర హక్కుల సాధన కోసం, పేద ప్రజల కోసం, రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన స్వాతంత్రం కోసం ఉద్యమిస్తున్న వరవరరావు జైల్లో ఏదైనా జరిగితే అది రాజ్యం చేసిన ద్రోహంగా అవుతుంది.

    న్యాయస్థానాలు శిక్షించిన వారికి కూడా ఆరోగ్యం బాగలేకపోతే మెరుగైన వైద్యం అందిస్తారని ఉరి శిక్ష వేసిన వారికి కూడా ఆరోగ్యం బాగలేకపోతే ఉరి వాయిదా వేస్తారు.

    అలాంటిది రోజుల తరబడి అనారోగ్యంతో ఉన్న తెలంగాణ ప్రాంత ఉద్యమ నేతను అక్కడి ప్రభుత్వాలు, పోలీస్ లు పట్టించిలుకోకపోవడం శోచనీయము.

    ఈ విషయంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడాలి.

  • -ప్రతిపక్ష పార్టీ నాయకుల విమర్శలలో అర్థం లేదు: హొం మంత్రి మహమూద్ అలీ
    12 July 2020 2:03 PM GMT

    -ప్రతిపక్ష పార్టీ నాయకుల విమర్శలలో అర్థం లేదు: హొం మంత్రి మహమూద్ అలీ

    - నూతన సచివాలయం నిర్మాణం లో భాగంగా అక్కడ నూతన మసీదును, మందిరంలను భారీస్థాయిలో నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత కూడా ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలు చేస్తూన్నారు.

    -నూతన సచివాలయం భవనం నిర్మించిన తరువాత మసీదులో, మందిరంలో ప్రార్థనలు చేసిన తర్వాతనే నూతన సచివాలయ భవనానికి ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు.

    - రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఏ అంశం దొరకనందునే మసీదు ,మందిరం విషయంలో వారు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు

    -తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేక , మున్ముందు ఇదేవిధంగా కొనసాగితే తమ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని ఈ రకమైన విమర్శలు చేస్తున్నారు

    -ముఖ్యమంత్రి సెక్యులర్ నాయకుడని అన్ని మతాల, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు

    - ఇప్పటికే యాదగిరిగుట్ట లో చరిత్రలో లిఖించదగిన దేవాలయాన్ని పునర్నిర్మి స్తున్న విషయం ప్రజలకు తెలుసుకున్నారు

    -అత్యంత భారీ స్థాయిలో యాదగిరిగుట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రికి సచివాలయంలో మసీదు ,మందిరం నిర్మాణం చేయడం పెద్ద సమస్య కాదు

    ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలనాయకులు గందరగోళం సృష్టించ వద్దని హితవు

    -తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుపై విశ్వాసం ఉంది.

    - ప్రతిపక్ష పార్టీల నాయకులు కల్లబొల్లి మాటలు వినే పరిస్థితిలో ప్రజలు లేరు

  • అరవింద్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: డీకే అరుణ, బీజేపీ నాయకురాలు
    12 July 2020 2:00 PM GMT

    అరవింద్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: డీకే అరుణ, బీజేపీ నాయకురాలు

    వరంగల్ జిల్లా కేంద్రంలో బిజెపి కార్యాలయంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కెసిఆర్ పాలనపై బిజెపి సాగిస్తున్న పోరాటాలకు రాష్ట్రంలో ఆదరణ పెరుగుతుందన్న భయాందోళనతోనే

    బీజేపీ నేతలపై టిఆర్ఎస్ దాడులకు పాల్పడుతుంది

    రాష్ట్ర వ్యాప్తంగా కెసిఆర్ ప్రభుత్వంలోని కమీషన్ల కాంట్రాక్టర్లుగా, భూ కబ్జాదారులుగా మంత్రులు ఎమ్మెల్యేలంతా సామాన్య ప్రజలన భయభ్రాంతులకు గురిచేస్తూ పీడిస్తున్నారు

    నేడు తెలంగాణ రాష్ట్రంలో మాఫియా పాలన సాగుతోంది మాఫియా గుప్పిట్లో అరాచకాలకు అక్రమార్కులకు కెసిఆర్ ప్రభుత్వం నిలువెత్తు నిదర్శనం గా మారిపోయింది

    ఎమ్మెల్యేలు నరేందర్ వినయ్ భాస్కర్ లపై కేసులు నమోదు చేయాలి

    సంఘటనా స్థలంలో ఉన్న దాడిని నిలువరించని పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలి

  • తెలంగాణలో కేసీఆర్ దొరగారి పాలన ఎంత అరాచకంగా ఉందో తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి
    12 July 2020 1:58 PM GMT

    తెలంగాణలో కేసీఆర్ దొరగారి పాలన ఎంత అరాచకంగా ఉందో తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి

    ♦️ విజయశాంతి, చైర్‌పర్సన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ

    - కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఎన్ని అవమానాల పాలవుతున్నారో నర్సుల ఆందోళన చూస్తే తెలుస్తుంది

    - పోస్టింగులు, సీనియారిటీ, జీతాల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రోడ్డెక్కిన నర్సులకు జవాబు చెప్పలేక సర్కారు నీళ్ళు నములుతోంది

    - ఇక ఆర్టీసీ సిబ్బందికి అందిన జూన్ నెల జీతాల్లోనూ ఆందోళన నెలకొంది. దారుణమైన కోతలతో ఆర్టీసీ సిబ్బందికి ఇచ్చిన జీతం డబ్బులతో ఏ విధంగా బతుకీడ్చాలో తెలియక వారు కుమిలిపోయే పరిస్థితి తీసుకొచ్చారు

    - ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సీఎం గారు ఎప్పుడు ఫాంహౌస్‌లో ఉంటారో... ఎప్పుడు ప్రగతిభవన్‌లో దర్శనమిస్తారో తెలియని దుస్థితి నెలకొంది

    - ఇదేనా మీరు చెప్పిన బంగారు తెలంగాణ? ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది? సీఎం దొరగారు జవాబు చెప్పాలి.

Print Article
Next Story
More Stories