TTD Employees Corona Positive: టీటీడీ సిబ్బందిలో 91 మందికి కరోనా!

TTD Employees Corona Positive: టీటీడీ సిబ్బందిలో 91 మందికి కరోనా!
x
TTD Employees Corona Positive
Highlights

TTD Employees Corona Positive: టీటీడీలో పని చేస్తున్న 98 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. దీనితో ఉద్యోగులకి మరిన్ని ఎక్కువ టెస్టులు చేయాలనీ అధికారులకి సూచించినట్టుగా అయన వెల్లడించారు.

TTD Employees Corona Positive: టీటీడీలో పని చేస్తున్న 98 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. దీనితో ఉద్యోగులకి మరిన్ని ఎక్కువ టెస్టులు చేయాలనీ అధికారులకి సూచించినట్టుగా అయన వెల్లడించారు. అయితే అనంతపురం, కడప జిల్లాలకు చెందిన ఎస్పీఎఫ్ సిబ్బంది సెలవులకి వెళ్లి తిరిగి రావడంతో టీటీడీలో కరోనా సోకిందని అయన అన్నారు. ఇక అలిపరి వద్ద 1704 , తిరుమలలో 1865 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా అయన తెలిపారు. అయితే చాలా మంది సిబ్బందికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని, కానీ టెస్టులు చేస్తే మాత్రం పాజిటివ్ వస్తుందని అయన అన్నారు.

ఇక జూన్ 10 నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతించిన తర్వాత రోజుకు సగటున 10 వేల మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారని వెల్లడించారు. ఇక ఇప్పటి వరకూ 634 భక్తులకు కరోనా పరీక్షలను నిర్వహించగా ఎవరికీ పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు. ఇక జూన్ 11 నుంచి జులై 10 వరకు ఆన్‌లైన్‌‌లో టిక్కెట్లు బుక్‌చేసుకున్న భక్తుల్లో 1,64,742 మంది దర్శనం చేసుకున్నారని, మరో ముప్పై శాతం మంది దర్శనం చేసుకోలేదని వెల్లడించారు. నెల రోజుల్లో శ్రీవారికి హుండీ ఆదాయం రూ. 16.73 కోట్లు వచ్చిందని స్పష్టం చేశారు.

ఇక ఏపీలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి రోజురోజుకు కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. శనివారం ఉన్న సమాచారం ప్రకారం.. గడిచిన 24 గంటల్లో గరిష్టంగా 1813 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇప్పటివరకూ నమోదైన కేసులలో ఇవే అత్యధికం.. అయితే రాష్ట్రానికి సంబంధించిన కరోనా పాజిటివ్ కేసులు 1775 గా ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 34 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సంఖ్య 2385 కి చేరుకుంది. అలాగే ఇతర దేశాల నుండి వచ్చిన వారి సంఖ్య 428 కే చేరింది. రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 27235 వున్నాయి. గడచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ తో 17 మంది మృతి చెందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories