Coronavirus Updates in AP: ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా..

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

Raj
By Raj
Published on: 12 July 2020 3:30 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా..
X
Coronavirus (representational Image)

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో మొత్తం 17,624 నమూనాలను పరీక్షించగా 1,914 మందికి కోవిడ్-‌19 నిర్ధారణ అయింది. అయితే గతంలో కరోనా భారిన పడిన 846 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని డిశ్చార్ట్‌ అయ్యారు. ఇక కరోనాతో కొత్తగా కర్నూల్‌ లో నలుగురు, శ్రీకాకుళం లో నలుగురు, కృష్ణ లో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు చిత్తూర్‌ లో ఇద్దరు, నెల్లూరు లో ఒక్కరు, అనంతపురంలో ఒక్కరు, పశ్చిమ గోదావరి లో మరొకరు మృతిచెందారు. రాష్ట్రంలో 11,071 మంది ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా, 2,357 మంది వివిధ జిల్లాల్లోని కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ లో చికిత్స పొందుతున్నారు.

ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 26,336 కరోనా పాజిటివ్ కేసులకు గాను 13,245 మంది డిశ్చార్జ్ కాగా 328 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 12,763 గా ఉంది. మరోవైపు ఆదివారం వరకు రాష్ట్రంలో 11,53,849 నమూనాలను పరీక్షించారు. ఇక జిల్లాల వారీగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య ఇలా ఉంది. కర్నూల్ 1420, కడప 868, చిత్తూరు 1473, అనంతపురం 1373, ప్రకాశం 449, నెల్లూరు 516, గుంటూరు 1535, కృష్ణ 959, పశ్చిమ గోదావరి 668, తూర్పు గోదావరి 1809, విశాఖపట్నం 571, విజయనగరం 463, శ్రీకాకుళం 659 గా ఉన్నాయి.




Raj

Raj

Next Story