Lorry hits Auto In Anantapur: ఆటోను ఢీకొట్టిన లారీ, ముగ్గురి దుర్మరణం

Lorry hits Auto In Anantapur: వ్యవసాయం చేసుకుంటూ.. వచ్చిన పంటను అమ్ముకొని కాలం వెళ్లదీస్తున్న వారికి లారీ రూపంలో వచ్చిన మృత్యువు.. వారి పాలిట యమపాశమైంది.

Raj
By Raj
Published on: 12 July 2020 11:58 AM IST
Lorry hits Auto In Anantapur:  ఆటోను ఢీకొట్టిన లారీ, ముగ్గురి దుర్మరణం
X
Lorry hits Auto In Anantapur: 3 died lorry hits auto bathalapalli anantapur district

Lorry hits Auto In Anantapur: వ్యవసాయం చేసుకుంటూ.. వచ్చిన పంటను అమ్ముకొని కాలం వెళ్లదీస్తున్న వారికి లారీ రూపంలో వచ్చిన మృత్యువు.. వారి పాలిట యమపాశమైంది. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బత్తలపల్లి మండల కేంద్రం సమీపంలో ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బత్తలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీవద్ద ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది.

తాడిమర్రి మండలం పిన్నదరికి చెందిన బాధితులు.. తమ చేలో పండిన బొప్పాయి పళ్లను వేసుకొని మార్కెట్లో అమ్మెందుకు బత్తలపల్లికి బయలుదేరారు. అయితే ఆటోలో బత్తలపల్లికి వస్తుండగా ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో సూరి, ఆదమ్మ దంపతులు, చెన్నకేశవ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను బత్తలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా లారీ డ్రైవర్ అప్రమత్తంగా లేనందువల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఆటో డ్రైవర్, లారీ డ్రైవర్ లు ఇద్దరిలో ఎవరైనా మద్యం సేవించారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు.


Raj

Raj

Next Story