Tiger movement in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో పులుల కలకలం.. భయాందోళనలో ప్రజలు

Tiger movement in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో పులుల కలకలం.. భయాందోళనలో ప్రజలు
x
Tiger (File Photo)
Highlights

Tiger movement in Telugu states: ఇటీవల కాలంలో పులులు జన సంచారాల్లోకి తరచూ వస్తున్నాయి.

Tiger movement in Telugu states: ఇటీవల కాలంలో పులులు జన సంచారాల్లోకి తరచూ వస్తున్నాయి. ఇలాంటి ఘటనల్లో గొర్రెలు, ఆవులపై దాడులు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనలకు గురవుతుండగా, అధికారులు వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా ఒకటి, రెండు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇవి సంచరిస్తున్నట్టు ఆనవాళ్లు దొరకడంతో అధికారులు వాటిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. వెలుగొడు తెలుగు గంగ కాలువ సమీపంలో పెద్దపులి గొర్రెల మందపై దాడి చేసింది. ఈ ఘటనలో రెండు గొర్రెలు మృతి చెందాయి. పులి దాడి చేసిన ఘటనపై గొర్రెల కాపరి హనుమంతు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. పులి సంచారంపై ఫారెస్ట్ అధికారులు పరిశీలిస్తున్నారు. పులికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించే పనిలో నిమగ్నమైన అధికారులు.

పెద్దపులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి పులి వస్తోందనని బిక్కుబిక్కుమంటూ క్షణాలు లెక్కబెడుతున్నారు. తక్షణమే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా చిరుత సంచారం కలకలం రేపింది. యాచారం మండలంలో కొత్తపల్లి, మేడిపల్లి, నందివనపర్తి, తాడిపర్తి అటవీ ప్రాంతాల్లో చిరుత కలకలం రేపుతోంది. పశువులపై, మేకల మంద పై దాడులకు పాల్పడుతుండడంతో ఆ ప్రాంత రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

యాచారం మండలం కొత్తపల్లి దామోదర రెడ్డి అనే రైతు వ్యవసాయ బావి వద్ద పశువుల మందలో గేదె దూడపై దాడి చేసి చంపేసింది. గత ఆరు నెలల క్రితం ఈ ప్రాంతంలో చిరుత దాడులు పెరిగాయి. మేకలు, దూడలను పొట్టనపెట్టుకుంటున్నది. మళ్ళీ ఆరు నెలల తరువాత మళ్ళీ చిరుత దాడులు చేస్తుండటం భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు నాలుగు బోన్​లు ఏర్పాటు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. వ్యవసాయ పనులకు వెళ్లంటే రైతులు వణికిపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories