టాప్ 5 న్యూస్ ...

టాప్ 5 న్యూస్ ...
x
Highlights

కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా కర్నాటక రాజకీయాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. విశ్వాస పరీక్షలో బీజేపీ ప్రభుత్వం విజయం సాధించిన...

కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా


కర్నాటక రాజకీయాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. విశ్వాస పరీక్షలో బీజేపీ ప్రభుత్వం విజయం సాధించిన మరుక్షణం ... స్పీకర్ రమేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సభలో స్పీకర్ స్ధానంలో కూర్చొనే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రాజీనామా లేఖను సభలోనే చదివి వినిపించిన అనంతరం ... విధాన సౌధ కార్యదర్శికి రాజీనామా లేఖను అందజేశారు. దీంతో సభ సాయంత్రం ఐదు గంటల వరకు వాయిదా పడింది.



విశ్వాస పరీక్షలో నెగ్గిన యడియూరప్ప..


కర్నాటక విధాన సౌధ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కర్ణాటక అసెంబ్లీలో యడియూరప్ప సర్కార్ విశ్వాస పరీక్షలో నెగ్గింది. 207 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం 104కు అవసరం ఉండగా.. బీజేపీకి ఎమ్మెల్యేలు 105 మంది ఉండగా.. మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతు ఇచ్చారు. మొత్తం 106 మంది ఓటేయ్యడంతో యడియూరప్ప బలం మేజిక్ ఫిగర్ ను దాటేసింది.విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా 100 ఓట్లు వచ్చాయి. బలపరీక్ష అనంతరం సభలో ఆర్థిక బిల్లును యడ్యూరప్ప సర్కార్ ప్రవేశపెట్టనుంది. విశ్వాస పరీక్షలో నెగ్గిన బీజేపీ... ఇక ఇప్పుడు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని రెడీ అవుతోంది. అందువల్లే విశ్వాస పరీక్షకు ఒక రోజు ముందే స్పీకర్ ఈ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ఆగస్టు అంతా తిరుమలకు ఉత్సవ శోభ!



ఆగస్టు నెల మొత్తం తిరుమల ఉత్సవ శోభను సంతరించుకోనుంది. టీటీడీ ఆధ్వర్యంలో నేలంతా వివిధ ఉత్సవాలు తిరుమలలో జరగనున్నాయి. ఈ వివరాలను టీటీడీ వెల్లడించింది. ఆగస్టు 3వ తేదీ నుంచి నెలాఖరు వరకూ వరుఆగస్టు నెల మొత్తం తిరుమల ఉత్సవ శోభను సంతరించుకోనుంది.


అట్టపెట్టెలో శిశువు


విజయనగరంలో దారుణం వెలుగు చూసింది. అట్టపెట్టె లో రెండురోజుల శిశువు మృతదేహం రోడ్డు పక్కన దొరికింది. ఓ యువకుడు ఇచ్చిన సమాచారం మేరకు విజయనగరంలోని ట్యాంక్‌బండ్‌ రోడ్డు సమీపంలో ఒకటో పట్టణ పోలీసులు ఆదివారం సాయంత్రం అట్టపెట్టెలో ఉన్న మగ పసికందు మృతదేహాన్ని గుర్తించారు.



పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన సీఎం జగన్‌


తిరుగులేని విజయంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.... స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఒక కన్ను పరిపాలనపై... మరో కన్ను పార్టీపై పెడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌‌రెడ్డి... క్షేత్రస్థాయిలో కేడర్‌‌ను మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories