ఆగస్టు అంతా తిరుమలకు ఉత్సవ శోభ!

ఆగస్టు అంతా తిరుమలకు ఉత్సవ శోభ!
x
Highlights

ఆగస్టు నెల మొత్తం తిరుమల ఉత్సవ శోభను సంతరించుకోనుంది. టీటీడీ ఆధ్వర్యంలో నేలంతా వివిధ ఉత్సవాలు తిరుమలలో జరగనున్నాయి. ఈ వివరాలను టీటీడీ వెల్లడించింది....

ఆగస్టు నెల మొత్తం తిరుమల ఉత్సవ శోభను సంతరించుకోనుంది. టీటీడీ ఆధ్వర్యంలో నేలంతా వివిధ ఉత్సవాలు తిరుమలలో జరగనున్నాయి. ఈ వివరాలను టీటీడీ వెల్లడించింది. ఆగస్టు 3వ తేదీ నుంచి నెలాఖరు వరకూ వరుఆగస్టు నెల మొత్తం తిరుమల ఉత్సవ శోభను సంతరించుకోనుంది. టీటీడీ ఆధ్వర్యంలో నేలంతా వివిధ ఉత్సవాలు తిరుమలలో జరగనున్నాయి. ఈ వివరాలను టీటీడీ వెల్లడించింది. ఆగస్టు 3వ తేదీ నుంచి నెలాఖరు వరకూ వరుసగా ఉత్సవాలు నిర్వహించనున్నామని టీటీడీ తెలిపింది. ఆగస్టు 3న శ్రీ అండాళ్ అమ్మవారి తిరువడిపురం శాత్తుమొరను పురస్కరించుకుని పురుశైవారి తోట ఉత్సవం నిర్వహిస్తారు. తులసీవనంలో ఆషాడ శుక్ల చతుర్థి రోజు పూర్వ ఫల్గుణీ నక్షత్రంలో భూదేవి అంశగా గోదాదేవి జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా పూర్వ ఫల్గుణి నక్షత్రం లో ఆండాళ్ తిరువడిపురం శాత్తుమొర నిర్వహిస్తారు.

పవిత్రమైన ఈ రోజున సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి పురుశైవారితోటకు వేంచేపు చేస్తారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు బయల్దేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి ఇస్తారు. హారతి, పుష్పసరం, శ్రీ శఠారి పొగడ చెట్టునకు సమర్పిస్తారు. శ్రీ శఠారికి అభిషేకం అనంతరం తిరిగి తిరుచ్చిపై ఉంచుతారు. అక్కడ నుంచి స్వామి, అమ్మవార్లు ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.

- ఆగస్టు 5న గరుడ పంచమి కావడంతో శ్రీవారికి గరుడసేవ నిర్వహించనున్నారు. శ్రీమహావిష్ణువు పరమభక్తుడు గరుత్మంతుడు శ్రావణ శుద్ధ పంచమి నాడు జన్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే స్వామివారికి ఆ రోజున ప్రత్యేకంగా గరుడసేవ ఉంటుంది.

- ఆగస్టు 6న క‌ల్కి జ‌యంతి, ఆగస్టు 9న శ్రీవ‌ర‌ల‌క్ష్మీవ్ర‌తం, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి నిర్వహిస్తారు.

- ఇక స్వామివారికి ఆలయంలో ఆగస్టు 11 నుంచి 3 రోజులపాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ఆగస్టు 10న అంకురార్పణ చేయనున్నారు.

- ఆగస్టు 12న నారాయణగిరిలో ఛత్రస్థాపనం

- 15న శ్రావణ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, శ్రీ విఖనస జయంతి

- ఆగస్టు 16న శ్రీవారు శ్రీ విఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేయుట

- 23న గోకులాష్టమి, ఆగ‌స్టు 24న తిరుమల శ్రీవారి శిక్యోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories