BRICS Summit: ప్రధాని మోడీ అధ్యక్షతన బ్రిక్స్ దేశాల సమావేశం

* హాజరైన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాధినేతలు * కరోనా నియంత్రణ, ఆష్ఘనిస్థాన్‌లో తాజా పరిస్థితులపై చర్చ

Sandeep Reddy
Updated on: 9 Sept 2021 9:00 PM IST
Conference of BRICS Countries Chaired by Prime Minister Modi
X

ప్రధాని మోడీ అధ్యక్షతన బ్రిక్స్ దేశాల సమావేశం (ట్విట్టర్ ఫోటో)

BRICS Summit: ప్రధాని మోడీ అధ్యక్షతన 13వ బ్రిక్స్ దేశాల సమ్మిట్ జరిగింది. ఈ సమావేశానికి హాజరైన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాధినేతలు కరోనా నియంత్రణ, ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా బ్రిక్స్ కూటమి మరింత శక్తివంతంగా ఎదగాలన్నారు ప్రధాని మోడీ. ఇదే సమయంలో ఆఫ్ఘన్ పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడంతోనే ఆష్ఘనిస్థాన్‌లో సంక్షోభం తలెత్తిందన్నారు. ఆఫ్ఘన్ సంక్షోభం భారత్‌తో పాటు సరిహద్దు దేశాలకు పెనుముప్పుగా అభివర్ణించారు. తాలిబన్ల పాలనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా పుతిన్ కోరారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story