Gold Rate:బంగారం ధరలు ఇక్కడ కాస్త తగ్గాయి..అక్కడ పెరిగాయి! పతనం అయిన వెండి ధరలు!!

Gold Rate:బంగారం ధరలు ఈరోజు దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. వెండి ధరలు అమాంతం కిందికి దిగివచ్చాయి.

K V D Varma
Updated on: 20 Aug 2020 6:31 AM IST
Gold rate dropped and silver rate slashed
X
Gold rate today

నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 20) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. ఢిల్లీ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. మరో వైపు వెండి ధరలు భారీ స్థాయిలో కిందికి దిగివచ్చాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. గురువారం (20.08.2020) బంగారం ధరలు బుధవారం ధరలతో పోలిస్తే తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 110 రూపాయలు తగ్గింది. దీంతో 51,560 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 120 రూపాయలు తగ్గింది. దీంతో 56,240 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పెరిగాయి..

బంగారం ధరలు స్వల్పంగా తగ్గితే, వెండి ధరలు మాత్రం ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే భారీస్థాయిలో పతనం అయింది. ఈరోజు ఏకంగా 3000 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పడిపోయాయి. దీంతో కేజీ వెండి ధర 68,100 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 110 రూపాయలు తగ్గింది. దీంతో 51,560 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 120 రూపాయలు తగ్గింది. దీంతో 56,240 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటి ధర కంటె 700 రూపాయలు పెరిగింది. దీంతో 51,850 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం నాటి ధర ఏకంగా 1470 రూపాయలు పెరిగింది. దాంతో 56,560 రూపాయలకు ఎగసింది. ఇక వెండి ధరలు.. ఇక్కడ కూడా కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే భారీస్థాయిలో పతనం అయింది. ఈరోజు ఏకంగా 3000 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పడిపోయాయి. దీంతో కేజీ వెండి ధర 68,100 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 20-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story