Gold Rate:బంగారం ధరలు కొద్దిగా పైకి..వెండి ధరలు కాస్త కిందికి..ఈరోజు రేట్లు ఇలా!

Gold Rate:బంగారం ధరలు స్వల్ప మార్పులతో దాదాపుగా నిలకడగా ఉన్నాయి. వెండి ధరలూ అదేవిధంగా ఉన్నాయి.

K V D Varma
Published on: 15 Aug 2020 7:47 AM IST
Gold Rate:బంగారం ధరలు కొద్దిగా పైకి..వెండి ధరలు కాస్త కిందికి..ఈరోజు రేట్లు ఇలా!
X
Gold Rate today

నిన్న పైకెగసిన బంగారం ధరలు ఈరోజూ అదే దారిలో నడిచాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్ప పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 15) దేశీయంగా భారీ పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు కూడా భారీ స్థాయిలో పైకి ఎగశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు భారీ పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (15.08.2020) బంగాస్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 60 రూపాయలు పెరిగింది. దీంతో 51,110 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 260 రూపాయలు పెరిగింది. దీంతో 55,760 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పెరిగాయి..

బంగారం ధరలు భారీగా పెరిగితే, వెండి ధరలు మాత్రం అతి స్వల్ప తగ్గుదాల కనబరిచాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే స్వల్పంగా తగ్గాయి. ఈరోజు 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల నుంచి కొద్దిగా కిందికి వెండి ధరలు దిగివచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 66,950 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 60 రూపాయలు పెరిగింది. దీంతో 51,110 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 260 రూపాయలు పెరిగింది. దీంతో 55,760 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు మిశ్రమంగా కదిలాయి. 22 క్యారెట్ల బంగారం కొద్దిగా పెరిగితే, 24 క్యారెట్ల బంగారం కాస్త దిగివచ్చింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం ధరతో పోలిస్తే 10 రూపాయలు పెరిగి 51,160 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం శుక్రవారం ధరతో పోలిస్తే 800 రూపాయలు తగ్గింది. దీంతో 55,100 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా శుక్రవారం నాటి ధరల కంటే స్వల్పంగా తగ్గాయి. ఈరోజు 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల నుంచి కొద్దిగా కిందికి వెండి ధరలు దిగివచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 66,950 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 15-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story