Gold Rate:మళ్ళీ ఎగసిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి ధరలు!

Gold Rate: నిన్న ఒక్కరోజు భారీగా తగ్గి హమ్మయ్య అనిపించిన బంగారం ధరలు మళ్ళీ పైకెగాశాయి. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి.

K V D Varma
Published on: 14 Aug 2020 7:38 AM IST
Gold Rate:మళ్ళీ ఎగసిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి ధరలు!
X
Gold rate today

ఒక్కరోజు భారీగా తగ్గి అందరినీ మురిపించిన బంగారం ధరలు మళ్ళీ పైకెగశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు భారీ పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 14) దేశీయంగా భారీ పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు కూడా భారీ స్థాయిలో పైకి ఎగశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు భారీ పెరుగుదాల నమోదు చేశాయి. శుక్రవారం (14.08.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 920 రూపాయలు పెరిగింది. దీంతో 51,050 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 820 రూపాయలు పెరిగింది. దీంతో 55,500 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పెరిగాయి..

బంగారం ధరలు భారీగా పెరిగితే, అదే దారిలో వెండి ధరలు కూడా భారీ పెరుగుదల కనబరిచాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. ఈరోజు 2000 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల వద్దకు వెండి ఎగసింది. దీంతో కేజీ వెండి ధర 67,000 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాములకు గురువారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 920 రూపాయలు పెరిగింది. దీంతో 51,050 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 820 రూపాయలు పెరిగింది. దీంతో 55,500 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం ధరతో పోలిస్తే 900 రూపాయలు పెరిగి 51,150 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం ధరతో పోలిస్తే భారిగా 1400 రూపాయలు పెరిగింది. దీంతో 55,900 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా గురువారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. ఈరోజు 2000 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల వద్దకు వెండి ఎగసింది. దీంతో కేజీ వెండి ధర 67,000 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 14-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story