Gold Rate:బాబోయ్..బంగారం ధరలు పైపైకి.. వెండి ధరలు అందనంత ఎత్తుకి..!

Gold Rate:బంగారం ధరలు మళ్ళీ పైకెగశాయి. మరోవైపు వెండి ధరలు దూసుకుపోతున్నాయి.

K V D Varma
Published on: 19 Aug 2020 7:40 AM IST
Gold rates are hike in Hyderabad 19.08.2020
X
Gold rate today

నిన్న కొద్దిగా తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు మళ్ళీ పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 19) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు భారీ స్థాయిలో పైకి ఎగశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు భారీ పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (19.08.2020) బంగారం ధరలు మంగళవారం ధరలతో పోలిస్తే పెరుగుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 970 రూపాయలు పెరిగింది. దీంతో 51,670 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 1040 రూపాయలు పెరిగింది. దీంతో 56,360 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పెరిగాయి..

బంగారం ధరలు పై పైకి కదిలితే, వెండి ధరలు మాత్రం మళ్ళీ భారీగా పెరుగుదలను కనబరిచాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే భారీగా పెరిగింది. ఈరోజు 2200 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 71వేల రూపాయల రికార్డు స్థాయికి వెండి ధరలు పరుగులు తీశాయి. దీంతో కేజీ వెండి ధర 71,100 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 970 రూపాయలు పెరిగింది. దీంతో 51,670 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 1040 రూపాయలు పెరిగింది. దీంతో 56,360 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు మార్పులేకుండా స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం నాటి ధర 51,150 రూపాయల వద్దే నిలకడగా నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం నాటి ధర 55,090 రూపాయలు వద్దే నిలకడగా ఉంది. ఇక వెండి ధరలు.. ఇక్కడ కూడా కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే భారీగా పెరిగింది. ఈరోజు 2200 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 71వేల రూపాయల రికార్డు స్థాయికి వెండి ధరలు పరుగులు తీశాయి. దీంతో కేజీ వెండి ధర 71,100 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 19-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story