Gold Rate: బంగారం కాస్త కిందికి..వెండి ధరలు మాత్రం పైపైకే! ఈరోజు రేట్లు ఇలా..

Gold Rate: బంగారం ధరలు స్వల్ప మార్పులతో దాదాపుగా నిలకడగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి.

K V D Varma
Updated on: 17 Aug 2020 8:33 AM IST
Gold Rate: బంగారం కాస్త కిందికి..వెండి ధరలు మాత్రం పైపైకే! ఈరోజు రేట్లు ఇలా..
X
Gold rate today

బంగారం ధరలు మళ్ళీ స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 17) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు భారీ స్థాయిలో పైకి ఎగశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. సోమవారం (17.08.2020) బంగారం ధరలు శనివారం ధరలతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 100 రూపాయలు తగ్గింది. దీంతో 51,010 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 100 రూపాయలు తగ్గింది. దీంతో 55,650 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పెరిగాయి..

బంగారం ధరలు స్వల్పంగా తగ్గితే, వెండి ధరలు మాత్రం భారీగా పెరుగుదలను కనబరిచాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ధరల కంటే భారీగా పెరిగింది. ఈరోజు 1060 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల నుంచి కొద్దిగా పైకి వెండి ధరలు ఎగశాయి. దీంతో కేజీ వెండి ధర 68,010 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 100 రూపాయలు తగ్గింది. దీంతో 51,010 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 100 రూపాయలు తగ్గింది. దీంతో 55,650 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు మార్పులేకుండా స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం కొద్దిగా పెరిగితే, 24 క్యారెట్ల బంగారం కాస్త దిగివచ్చింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ధర 51,160 రూపాయల వద్దే నిలకడగా నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం నాటి ధర 55,100 రూపాయలు వద్దే నిలకడగా ఉంది. ఇక వెండి ధరలు.. ఇక్కడ కూడా కేజీ వెండి ధర శనివారం నాటి ధర కంటే భారీగా పెరిగింది. ఈరోజు 1060 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల నుంచి కొద్దిగా పైకి వెండి ధరలు ఎగశాయి. దీంతో కేజీ వెండి ధర 68,010 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 17-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story