Gold Rate:బంగారం ధరలు తగ్గాయి..వెండి ధరలు పడిపోయాయి.. తాజా రేట్లివే!

Gold Rate:భారీ స్థాయిలో పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి.

K V D Varma
Published on: 12 Aug 2020 6:53 AM IST
gold and silver rates crashed today
X
gold rate today

కొద్దికాలంగా భారీగా పెరిగి అమ్మో అనిపించిన బంగారం ధరలు వరుసగా మూడోరోజూ కిందికి దిగివచ్చాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 12) దేశీయంగా తగ్గుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు అమాంతం పడిపోయాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. బుధవారం (12.08.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధరల కంటే కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 440 రూపాయలు తగ్గింది. దీంతో 53,140 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 440 రూపాయలు తగ్గింది. దీంతో 58,030 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు భారీగా తగ్గాయి..

బంగారం ధరలు తగ్గుదల నమోదు చేస్తే, వెండి ధరలు మాత్రం భారీ తగ్గుదల కనబరిచాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే భారీగా దిగివచ్చాయి. ఈరోజు 2650 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 72 వేల రూపాయల గరిష్ట రికార్డు ధర వద్ద వెండి నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 72,500 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 440 రూపాయలు తగ్గింది. దీంతో 53,140 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 440 రూపాయలు తగ్గింది. దీంతో 58,030 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం ధరతో పోలిస్తే 650 రూపాయలు తగ్గి 53,450 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం ధరతో పోలిస్తే 650 రూపాయలు తగ్గింది. దీంతో 54,700 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా మంగళవారం నాటి ధరల కంటే భారీగా తగ్గాయి. ఈరోజు 2650 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 72 వేల రూపాయల గరిష్ట రికార్డు ధర వద్ద వెండి నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 72,500 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 12-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story