Gold Rate: శుభవార్త..కాస్త తగ్గిన బంగారం ధరలు.. భారీగా దిగివచ్చిన వెండి ధరలు!

Gold Rate: శుభవార్త..కాస్త తగ్గిన బంగారం ధరలు.. భారీగా దిగివచ్చిన వెండి ధరలు!
x
Highlights

Gold Rate: బంగారం ధరలు కొద్దిగా శాంతించినట్టు కనిపిస్తున్నాయి. మరోవైపు వెండి ధరలు భారీ తగ్గుదల కనబర్చాయి.

బంగారం ధరలు కొద్దిగా శాంతించినట్టు కనిపిస్తున్నాయి. మరోవైపు వెండి ధరలు భారీ తగ్గుదల కనబర్చాయి.. హైదరాబాద్ లో బంగారం ధరలు చాలాకాలం తరువాత కాస్త తగ్గుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 10) దేశీయంగా తగ్గుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు భారీగా దిగివచ్చాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గుదల నమోదు చేశాయి. సోమవారం (10.08.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 400 రూపాయలు తగ్గింది. దీంతో 53,800 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 440 రూపాయలు తగ్గింది. దీంతో 59 వేల రూపాయల రికార్డ్ మార్కునుంచి దిగివచ్చి 58,690 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు తగ్గాయి..

బంగారం ధరలు తగ్గుదల నమోదు చేస్తే, వెండి ధరలు కూడా భారీగా దిగివచ్చాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ధరల కంటే భారీగా తగ్గాయి. ఈరోజు 2310 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 76వేల రూపాయల గరిష్ట రికార్డు ధర నుంచి కిందికి దిగివచ్చింది. దీంతో కేజీ వెండి ధర 74,200 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 690 రూపాయలు పెరిగింది. దీంతో 54,200 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 810 రూపాయలు పెరిగింది. దీంతో 59 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 59,130 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం ధరతో పోలిస్తే 400 రూపాయలు తగ్గి 54,350 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అమాంతం పెరిగింది. శనివారం ధరతో పోలిస్తే 3240 రూపాయలు పెరిగింది. దీంతో 59,290 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు శనివారం నాటి ధరల కంటే భారీగా తగ్గాయి. ఈరోజు 2310 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 76వేల రూపాయల గరిష్ట రికార్డు ధర నుంచి కిందికి దిగివచ్చింది. దీంతో కేజీ వెండి ధర 74,200 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 10-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories