Gold Rate: ఆగని బంగారం భగభగలు..వెండి ధరలూ అదేతీరు!

Gold Rate:బంగారం ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు మళ్ళి భారీ పెరుగుదల కనబర్చాయి..

K V D Varma
Published on: 8 Aug 2020 7:56 AM IST
Gold Rate: ఆగని బంగారం భగభగలు..వెండి ధరలూ అదేతీరు!
X

బంగారం ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు మళ్ళి భారీ పెరుగుదల కనబర్చాయి.. హైదరాబాద్ లో బంగారం ధరలు మళ్ళీపెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 08) దేశీయంగా పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు పెరుగుదల కనబర్చాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మరికాస్త పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (08.08.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 690 రూపాయలు పెరిగింది. దీంతో 54,200 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 810 రూపాయలు పెరిగింది. దీంతో 59 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 59,130 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పెరిగాయి..

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే, వెండి ధరలు మరింత దూసుకుపోయాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. ఈరోజు 3010 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 76వేల రూపాయల గరిష్ట రికార్డు ధర వద్ద వెండి నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 76,510 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 690 రూపాయలు పెరిగింది. దీంతో 54,200 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 810 రూపాయలు పెరిగింది. దీంతో 59 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 59,130 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం ధరతో పోలిస్తే 600 రూపాయలు పెరిగి 54,750 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం ధరతో పోలిస్తే 700 రూపాయలు పెరిగింది. దీంతో 56,050 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా శుక్రవారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. ఈరోజు 3010 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 76వేల రూపాయల గరిష్ట రికార్డు ధర వద్ద వెండి నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 76,510 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 08-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story