Gold Rate:మెల్లగా దిగివస్తున్న బంగారం ధరలు.. ఎగసిన వెండి ధరలు!

Gold Rate కొద్దికాలంగా భారీగా పెరిగి అమ్మో అనిపించిన బంగారం ధరలు మెల్లగా దిగివస్తున్నాయి. మరో వైపు వెండి ధరలు పైకి ఎగశాయి

K V D Varma
Published on: 11 Aug 2020 7:26 AM IST
Gold Rate:మెల్లగా దిగివస్తున్న బంగారం ధరలు.. ఎగసిన వెండి ధరలు!
X
gold rate today

కొద్దికాలంగా భారీగా పెరిగి అమ్మో అనిపించిన బంగారం ధరలు మెల్లగా దిగివస్తున్నాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 11) దేశీయంగా తగ్గుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు పైకి ఎగశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. మంగళవారం (11.08.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధరల కంటే కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 230 రూపాయలు తగ్గింది. దీంతో 53,580 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 230 రూపాయలు పెరిగింది. దీంతో 58,470 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పెరిగాయి..

బంగారం ధరలు తగ్గుదల నమోదు చేస్తే, వెండి ధరలు మాత్రం పెరుగుదల కనబరిచాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. ఈరోజు 940 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 71 వేల రూపాయల గరిష్ట రికార్డు ధర వద్ద వెండి నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 71,500 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 230 రూపాయలు తగ్గింది. దీంతో 53,580 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 230 రూపాయలు పెరిగింది. దీంతో 58,470 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం ధరతో పోలిస్తే 260 రూపాయలు పెరిగి 54,100 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం ధరతో పోలిస్తే 3950 రూపాయలు తగ్గింది. దీంతో 55,350 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా సోమవారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. ఈరోజు 940 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 71 వేల రూపాయల గరిష్ట రికార్డు ధర వద్ద వెండి నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 71,500 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 11-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story