Gold Rate: బంగారం ధరలు పై పైకి..వెండి ధరల మోత!

K V D Varma
Published on: 9 July 2020 8:01 AM IST
Gold Rate: బంగారం ధరలు పై పైకి..వెండి ధరల మోత!
X
Gold Rate today (Representational image)

నిన్న కొద్దిగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు మరింత పెరిగాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 09) దేశీయంగా కిందికి పైకెగాశాయి. మరో వైపు వెండి ధరలు ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (09.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 370 రూపాయలు పెరిగింది. దీంతో 46,780 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 370 రూపాయలు పెరిగింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,990 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే ఏకంగా 820 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కుదాటింది. కేజీ వెండి ధర 50,020 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాములకు బుధవారం నాటి ధరల కంటే పెరిగాయి. పపది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 370 రూపాయలు పెరిగింది. దీంతో 46,780 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 370 రూపాయలు పెరిగింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,990 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం ధరతో పోలిస్తే 250 రూపాయలు పెరిగి 47,500 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం నాటి ధర కంటే 250 రూపాయలు పెరిగింది. దీంతో 48,700 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 800 రూపాయల పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర 50 వేల రూపాయల మార్కు దాటింది. కేజీ వెండి ధర 50,020 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 09-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story