Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. కాస్త తగ్గిన వెండి ధరలు!

Gold Rate: వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 08) దేశీయంగా కిందికి పైకేగాశాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి.

K V D Varma
Published on: 8 July 2020 8:14 AM IST
Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. కాస్త తగ్గిన వెండి ధరలు!
X

వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 08) దేశీయంగా కిందికి పైకేగాశాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మిశ్రమంగా నమోదు అయ్యాయి. బుధవారం (08.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 310 రూపాయలు పెరిగింది. దీంతో 46,410 రూపాయల వద్ద నిలిచింది. అయితే, 24 క్యారెట్ల బంగారం మాత్రం తగ్గుదల నమోదు చేయడం విశేషం. హైదరబాద్ లో 24 క్యారెట్ల బంగారం మాత్రం పది గ్రాములకు 90 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,620 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే 400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 49 వేల రూపాయల మార్కుదాటింది. కేజీ వెండి ధర 49,200 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాములకు మంగళవారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 310 రూపాయలు పెరిగింది. దీంతో 46,410 రూపాయల వద్ద నిలిచింది. అయితే, 24 క్యారెట్ల బంగారం మాత్రం తగ్గుదల నమోదు చేయడం విశేషం. ఇక్కడా 24 క్యారెట్ల బంగారం మాత్రం పది గ్రాములకు 90 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,620 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం ధరతో పోలిస్తే 350 రూపాయలు పెరిగి 47,250 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం నాటి ధర కంటే 350 రూపాయలు పెరిగింది. దీంతో 48,450 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 400 రూపాయల తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర 49 వేల రూపాయల మార్కు దాటింది. కేజీ వెండి ధర 49,200 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 08-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story