Gold Rate:భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎగసిన వెండి ధరలు!

Gold Rate: వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజూ మరికాస్త దిగివచ్చాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 07) దేశీయంగా కిందికి దిగివచ్చాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం భారీ పెరుగుదల నమోదు చేశాయి.

K V D Varma
Updated on: 7 July 2020 7:35 AM IST
Gold Rate:భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎగసిన వెండి ధరలు!
X

వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజూ మరికాస్త దిగివచ్చాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 07) దేశీయంగా కిందికి దిగివచ్చాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం భారీ పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. మంగళవారం (07.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధరల కంటే బాగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 140 రూపాయలు తగ్గింది. దీంతో 46,100 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 140 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,710 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు మాత్రం భారీ పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే 1090 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49 వేల రూపాయల మార్కుదాటింది. కేజీ వెండి ధర 49,600 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాములకు సోమవారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 140 రూపాయలు తగ్గింది. దీంతో 46,100 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 140 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,710 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు బాగానే తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం ధరతో పోలిస్తే 220 రూపాయలు తగ్గి 46,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం నాటి ధర కంటే 220 రూపాయలు తగ్గింది. దీంతో 48,100 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 1090 రూపాయల పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర 49 వేల రూపాయల మార్కు దాటింది. కేజీ వెండి ధర 49,600 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 07-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story