బంగారం ధరల మోత..వెండి ధరల దూకుడు!

బంగారం ధరల మోత..వెండి ధరల దూకుడు!
x
Highlights

బంగారం ధరలు హైదరాబాద్ లో కొద్దిగా పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూన్ 22) దేశీయంగా పైపైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

బంగారం ధరలు హైదరాబాద్ లో కొద్దిగా పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూన్ 22) దేశీయంగా పైపైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం (22.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 520 రూపాయలు పెరిగింది. దీంతో 46,090 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 570 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,280 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ధరల కంటే 620 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48వేల మార్కు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 48,670 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 520 రూపాయలు పెరిగింది. దీంతో 46,090 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 570 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,280 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం ధర తో పోలిస్తే 510 రూపాయలు పెరిగి 46,760 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం ధర కంటే 500 రూపాయలు పెరిగింది దీంతో 47,960 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 620 రూపాయల పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర 48 వేల మార్కుకు ఎగసి 48,670 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 22-06-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories