Gold Rate Today:మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి!

Gold Rate Today: కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు హైదరాబాద్ లో మళ్ళీ పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూన్ 29) దేశీయంగా పైపైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి.

K V D Varma
Updated on: 29 Jun 2020 10:03 AM IST
Gold Rate Today:మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి!
X

కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు(Gold Rate) హైదరాబాద్ లో మళ్ళీ పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూన్ 29) దేశీయంగా పైపైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం (29.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 230 రూపాయలు పెరిగింది. దీంతో 46,410 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 230 రూపాయల పేరుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,620 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు కూడా అదేదారిలో పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ధరల కంటే 340 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48వేల మార్కు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 48,110 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 230 రూపాయలు పెరిగింది. దీంతో 46,410 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 230 రూపాయల పేరుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,620 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం ధరతో పోలిస్తే 510 రూపాయలు పెరిగి 47,210 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం ధర కంటే 510 రూపాయలు పెరిగింది. దీంతో 48,410 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 340 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48వేల మార్కు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 48,110 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 29-06-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story