Gold Rate: పన్నెండో రోజూ దిగిరాని బంగారం ధరలు..వెండి ధరలు అదే దారిలో!

Gold Rate: బంగారం ఎగసిపడుతూనే ఉంది. మరోవైపు వెండి కూడా పరుగులు తీసింది.

K V D Varma
Updated on: 4 Aug 2020 7:05 AM IST
Gold Rate: పన్నెండో రోజూ దిగిరాని బంగారం ధరలు..వెండి ధరలు అదే దారిలో!
X

బంగారం ఎగసిపడుతూనే ఉంది. మరోవైపు వెండి కూడా పరుగులు తీసింది. హైదరాబాద్ లో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 04) దేశీయంగా పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు దూకుడు ప్రదర్శించాయి. రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కూడా పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం (04.08.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 90 రూపాయలు పెరిగింది. దీంతో 51,880 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 90 రూపాయలు పెరిగింది. దీంతో 56 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 56,590 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పెరిగాయి..

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే, వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే పెరిగింది. ఈరోజు 280 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 65 వేల రూపాయల గరిష్ట రికార్డు ధరను దాటి నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 65,120 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 730 రూపాయలు పెరిగింది. దీంతో 49,780 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 820 రూపాయలు పెరిగింది. దీంతో 54 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 54,300 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం ధరతో పోలిస్తే 190 రూపాయలు పెరిగి 52,450 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం ధరతో పోలిస్తే 190 రూపాయలు పెరిగింది. దీంతో 53,650 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 65 వేల రూపాయల గరిష్ట రికార్డు ధరను దాటి పైకెగశాయి. దీంతో కేజీ వెండి ధర 65,120 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 04-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story