Gold Rate:తగ్గని బంగారం ధరల జోరు..మళ్ళీ మోతెక్కిన వెండి ధరలు!

Gold Rate: బంగారం ధరలు అల్ టైం రికార్డు స్థాయి నుంచి ఇంకా పై పైకే కదులుతున్నాయి. మరోవైపు నిన్న బాగా తగ్గిన వెండి ఈరోజు మళ్ళీ అమాంతం పెరిగిపోయింది.

K V D Varma
Updated on: 1 Aug 2020 7:40 AM IST
Gold and silver rate today 01 st august
X
Gold rate today

బంగారం ధరలు అల్ టైం రికార్డు స్థాయి నుంచి ఇంకా పై పైకే కదులుతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్నబంగారం ఈరోజు మరికాస్త పెరిగింది. మరోవైపు నిన్న బాగా తగ్గిన వెండి ఈరోజు మళ్ళీ అమాంతం పెరిగిపోయింది. హైదరాబాద్ లో బంగారం ధరలు మళ్ళీపెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 01) దేశీయంగా పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు కూడా పరుగులు తీశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మరికాస్త పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (01.08.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 230 రూపాయలు పెరిగింది. దీంతో 51,260 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 230 రూపాయలు పెరిగింది. దీంతో 55 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 55,830 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పెరిగాయి..

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే, వెండి ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే బాగా పెరిగింది. ఈరోజు 2010 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 65 వేల రూపాయల గరిష్ట రికార్డు ధర కు వెండి బాగా మళ్ళీ ఎగసింది. దీంతో కేజీ వెండి ధర 65,010 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 230 రూపాయలు పెరిగింది. దీంతో 51,260 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 230 రూపాయలు పెరిగింది. దీంతో 55 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 55,830 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం ధరతో పోలిస్తే 410 రూపాయలు పెరిగి 52,210 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం ధరతో పోలిస్తే 210 రూపాయలు పెరిగింది. దీంతో 53,210 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 65 వేల రూపాయల గరిష్ట రికార్డు ధర వద్దకు వెండి ఎగబాకింది. దీంతో కేజీ వెండి ధర 65,010 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 01-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story