Gold Rate:ఆగని బంగారం ధరల పరుగు.. భారీగా తగ్గిన వెండి ధరలు!

Gold Rate: బంగారం ధరలు అల్ టీం రికార్డు స్థాయి నుంచి ఇంకా పై పైకే కదులుతున్నాయి. మరోవైపు వెండి ఈరోజు ఒక్కసారిగా కిందికి దిగివచ్చింది.

K V D Varma
Published on: 31 July 2020 8:11 AM IST
gold and silver rate today 31st july
X
gold rate today

బంగారం ధరలు అల్ టీం రికార్డు స్థాయి నుంచి ఇంకా పై పైకే కదులుతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్నబంగారం ఈరోజు మరికాస్త పెరిగింది. మరోవైపు వెండి ఈరోజు ఒక్కసారిగా కిందికి దిగివచ్చింది. హైదరాబాద్ లో బంగారం ధరలు మళ్ళీపెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 31) దేశీయంగా పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు కిందికి దిగివచ్చాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మరికాస్త పెరుగుదల నమోదు చేశాయి. శుక్రవారం (31.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 230 రూపాయలు పెరిగింది. దీంతో 50,030 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 290 రూపాయలు పెరిగింది. దీంతో 55 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 55,600 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు నెమ్మదించాయి..

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే, వెండి ధరలు భారీ స్థాయిలో పడిపోయాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ధరల కంటే బాగా తగ్గింది. ఈరోజు 3050 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 66 వేల రూపాయల గరిష్ట రికార్డు ధర నుంచి వెండి బాగా కిందకు దిగివచ్చింది. దీంతో కేజీ వెండి ధర 63,00 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 230 రూపాయలు పెరిగింది. దీంతో 50,030 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 290 రూపాయలు పెరిగింది. దీంతో 55 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 55,600 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం ధరతో పోలిస్తే 300 రూపాయలు పెరిగి 51,800 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం ధరతో పోలిస్తే 300 రూపాయలు పెరిగింది. దీంతో 53,000 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో 66 వేల రూపాయల గరిష్ట రికార్డు ధర నుంచి వెండి బాగా కిందికి దిగివచ్చింది. దీంతో కేజీ వెండి ధర 63,000 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 31-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story