Nellore TDP Leader Dies With Corona: కరోనాతో టీడీపీ నేత మృతి!

Nellore TDP Leader Dies With Corona: కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరి సోకి భయబ్రాంతులకి గురి చేస్తోంది. తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త, టీడీపీ నేత పి. టి రంగరాజన్ మృతి చెందారు.

Krishna
Updated on: 12 July 2020 8:23 PM IST
Nellore TDP Leader Dies With Corona: కరోనాతో టీడీపీ నేత మృతి!
X
Nellore Tdp Leader Dies With Coronavirus Positive

Nellore Tdp Leader Dies With Corona: కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరి సోకి భయబ్రాంతులకి గురి చేస్తోంది. తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త, టీడీపీ నేత పి. టి రంగరాజన్ మృతి చెందారు. దీనితో ఆ పార్టీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవిచంద్ర సంతాపం తెలిపారు. రంగరాజన్ కుటుంబానికి నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అయన పార్టీకి చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు.

ఇక ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. గడిచిన 24 గంటల్లో 1,914 మందికి కరోనా సోకింది. అయితే గతంలో కరోనా భారిన పడిన 846 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని డిశ్చార్ట్‌ అయ్యారు. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 29.168కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13, 428 యాక్టివ్ కేసులు ఉండగా, 15,412మంది డిశ్చార్జ్ అయ్యారు. అటు కరోనాతో 328 మంది మృతి చెందారు. ఇక ఈ రోజు 17,624 నమూనాలను పరీక్షించగా 1,914 మందికి కోవిడ్-‌19 నిర్ధారణ అయింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు మృతి చెందారు. కృష్ణా, విశాఖ జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు, నెల్లూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.

Krishna

Krishna

Next Story